Begin typing your search above and press return to search.
తెలంగాణకు గుండు సున్నా.. విపత్తు సాయంలో మోడీ సవతి ప్రేమ
By: Tupaki Desk | 13 Nov 2020 5:35 PM GMTకేంద్రంలోని మోడీ సర్కార్ విపత్తు సాయంలో మరోసారి తెలంగాణకు మొండి చేయచి చూపించింది. అంత మాత్రంగా వరదలు వచ్చిన కర్ణాటక రాష్ట్రానికి 577.84 కోట్లు కేటాయించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. వరదలతో నిండా మునిగిన హైదరాబాద్ కు, తెలంగాణకు నయా పైసా విదిల్చికపోవడం విమర్శలకు తావిచ్చింది.
తాజాగా ఆరు రాష్ట్రాలకు కేంద్రం విపత్తు సహాయం మంజూరు చేసింది. ప్రకృతి విపత్తు సహాయార్ధం హైలెవెల్ కమిటీ నిర్ణయం మేరకు ఈ సహాయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ ఆరు రాష్ట్రాల్లో అధికమొత్తంలో పశ్చిమ బెంగాల్ కు కేంద్ర సాయం అందిందని చెప్పాలి.
బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు నిధుల మంజూరు అయ్యాయి. మొత్తం రూ. 4,381.88 కోట్లు ముంజూరు చేసింది చేసిన కేంద్ర హోంశాఖ. 2020లో “ఉంపున్”, “నిసర్గ” తుఫాన్లు, వరదలు, కొండచరియలు విరిగిపడి నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్రం ఈ సాయం ప్రకటించింది. ఉంపున్ తుఫాన్ సహాయం కింద అత్యధికంగా బెంగాల్ రాష్ట్రానికి రూ. 2,707.77 కోట్ల సాయం చేసింది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద బీభత్సానికి మాత్రం ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవడం విశేషం.. మొన్ననే ఏపీలో కేంద్ర బృందం పరిశీలనకు వచ్చి వెళ్ళింది. ఆ బృందం ఇచ్చే నివేదికను బట్టి ఏపీకి నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. తెలంగాణాకు కూడా అప్పుడే నిధులు మంజూరు చేసే అవకాశం కనిపిస్తోంది.