Begin typing your search above and press return to search.
అప్పట్లో జీఎస్‌టీ, ఇప్పుడు ఐటీ...ఇన్ఫోసిస్ పై కేంద్రం ఫైర్
By: Tupaki Desk | 23 Aug 2021 8:30 AM GMTకొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్ ను సాంకేతిక లోపాలు వెన్నాడుతూనే ఉన్నాయి. రెండు రోజులుగా పోర్టల్ పూర్తిగా అందుబాటులోనే లేకుండా పోవడంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రారంభించి రెండున్నర నెలలు అవుతున్నా ఇలా సమస్యలు కొనసాగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సోమవారం వచ్చి వివరణ ఇవ్వాలంటూ పోర్టల్ ను రూపొందించిన టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ మేరకు వివరణ కోరుతూ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవో సలీల్ పరేఖ్ కు ఆదివారం నోటీసులు జారీ చేసింది. జూన్ 7న కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ పోర్టల్ ను ప్రారంభించారు.
అయితే రెండున్నర నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకూ ఇందులో ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ట్యాక్స్ పేయర్లు ఫిర్యాదు చేశారు. వీటిని పరిష్కరించాల్సిందిగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇన్ఫోసిస్ ను కోరారు. ఈ పోర్టల్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయాలని ఆదేశించారు. యూజర్లకు పని సులువు చేయడానికి ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చినా, ఇందులోని అవాంతరాలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మరోవైపు, యూజర్లకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై ఇన్ఫోసిస్ స్పందించింది. దీనిపై తాము పని చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించింది.
రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, టీడీఎస్ క్లెయిమ్ కోసమైనా గంటల తరబడి సమస్య ఎదురవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో పోర్టల్ సమస్యలపై పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులు, ఇతర భాగస్వాములు ఫిర్యాదులు చేశారు. అటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫోసిస్ గందరగోళం చేసిన రెండో ప్రాజెక్టు ఇది. మొదటిది జీఎస్ టీ పోర్టల్ కాగా ఇప్పుడు ఇన్ కం ట్యాక్స్ పోర్టల్. రెండు వరుస వైఫల్యాలనేవి కాకతాళీయంగా అనుకోవడానికి లేదు. దీనితో కంపెనీకి సామర్థ్యాలైనా లేకపోవచ్చు లేదా పనిని సజావుగా పూర్తి చేసి ఇచ్చే ఉద్దేశమైనా లేకపోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది అని ఐటీ శాఖ ట్వీట్ ను ప్రస్తావిస్తూ ఐఅండ్ బీ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ట్విటర్ లో వ్యాఖ్యానించారు.
రిటర్నుల ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించడం, రిఫండ్ ల వేగవంతం లక్ష్యంగా కొత్త ఐటీ పోర్టల్ అభివృద్ధికి రూ.4,242 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. జూన్ వరకూ రూ.164.5 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్‌టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ప్రా జెక్టు నిధుల మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 7న పోర్టల్‌ను ప్రభు త్వం ప్రారంభించింది.