Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలకు కేంద్రం బిగ్ బ్రేక్... అప్పటి దాకా...?

By:  Tupaki Desk   |   28 Jan 2022 7:07 AM GMT
కొత్త జిల్లాలకు కేంద్రం బిగ్ బ్రేక్... అప్పటి దాకా...?
X
కొత్త జిల్లాల మీద కొత్త రాజకీయ మంట ఏపీలో రాజుకుంది. దీని మీద ఇపుడిపుడే విపక్షాలు పెదవి విప్పుతున్నాయి. మరో వైపు సెంటిమెంట్ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాలో రాజుకుంటోంది. ఇవన్నీ ఇలా ఉండగానే ప్రభుత్వం మాత్రం దూకుడుగా అడుగులు వేయాలనుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉగాది నాటికి కొత్త జిల్లాలలో పాలన మొదలెట్టాలని చూస్తోంది.

అయితే వైసీపీ సర్కార్ అతి ఉత్సాహానికి కేంద్రం చల్లగా నీళ్ళు జల్లేసింది. ఇప్పట్లో అది కాదని కూడా తేల్చేసింది. ఈ మేరకు జనగణన శాఖ డైరెక్టర్ అన్ని రాష్ట్రాలకు తాజాగా లేఖ రాశారని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ దాకా దేశంలో ఏ రాష్ట్రంలోనూ జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చడానికి వీలులేదని ఆ లేఖలో ఖరాఖండీగా చెప్పేశారు.

జనగణనకు ఈ బౌండరీస్ మార్చడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని కూడా పేర్కొన్నారు. అందువల్ల ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు ఈ తాత్కాలిక నిషేధాన్ని పాటించి తీరాలని కూడా జనగణన శాఖ డైరెక్టర్ ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పక్కా క్లారిటీగా చెప్పేశారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఏపీలో కొత్త జిల్లాలకు టెంపరరీగా అయినా భారీ బ్రేక్ పడిపోయింది.

ప్రభుత్వం రెండు రోజుల క్రితం కొత్త జిల్లాలను ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషనే కేంద్ర జనగణన శాఖ డైరెక్టర్ చేత ఈ తాజా ఉత్తర్వులు మరోసారి జారీ చేయడానికి కారణమైంది అంటున్నారు. దీంతో నెల రోజులలోపు అందరితో సంప్రదింపులు జరిపి మిగిలిన తతంగం అంతా పూర్తి చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడమే ఇక మిగిలింది అని భావిస్తున్న వైసీపీ సర్కార్ కి ఈ పరిణామం ఒక విధంగా షాకింగే అని చెప్పాలి.

మరో వైపు ఇపుడు అర్జంటుగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది కరోనా వ్యాక్సినేషన్ మీద అని కూడా కేంద్రం గుర్తు చేసినట్లు అవుతోంది. ఈ రోజుకీ సగానికి సగం మందికి రెండవ విడత వ్యాక్సిన్ అన్నది జరగలేదు. సీన్ ఇలా ఉంటే ఇపుడు కొత్త జిల్లాలకు తొందర ఏముందన్నది కూడా కేంద్ర భావన కావచ్చు. అదే టైమ్ లో ఎంత తొందరగా వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం పూర్తి చేస్తే అంత తొందరగా జనగణన చేపట్టాలన్నది కూడా కేంద్రం కచ్చితమైన ఆలోచనగా ఉంది అంటున్నారు.

ఇలా రానున్న రెండు మూడు నెలలూ వ్యాక్సినేషన్ సెంట్ పర్సెంట్ పూర్తి చేసి ఆ మీదట జనాభా గణనాను జూన్ నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పూర్తి చేయించాలి అన్నది కూడా కేంద్రం ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అంటే ఇవన్నీ చూస్తూంటే జూన్ తరువాత కానీ కొత్త జిల్లాల ఊసు అయితే లేకపోవచ్చు అంటున్నారు. మొత్తానికి వేడి ఇలా రగిలించగానే కేంద్రం బ్రేకులు వేయడంతో కొత్త ముచ్చట చప్పున చల్లారినట్లే అంటున్నార్.

మరి జూన్ కైనా జనాభా గణనే ముందు పూర్తి కావాలి. అది కేంద్రం ప్రయారిటీ. దానికి దాటి ముందుకు వెళ్ళే సీన్ అయితే రాష్ట్రాలకు లేదు. ఎంత ఆలస్యం అయినా కూడా అది పూర్తి చేసిన మీదటనే కొత్త జిల్లాలు అయినా కొత్త కార్యక్రమాలు అయినా అంటూ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కేంద్రం ఇచ్చేసింది అనుకోఅవాలి. మరి కొత్త జిల్లాలు ఎపుడు అని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ముందు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం, ఆ తరువాత జనాభా గణన పూర్తి చేయడం ఈ రెండూ దాటిన తరువాతనే అని జవాబు చెప్పాల్సి వస్తోంది. సో వైసీపీ ఆశలకు అలా ఆవిరి అయ్యే ఉత్తర్వు వచ్చేసింది అనుకోవాలిగా.