Begin typing your search above and press return to search.
పుల్ మార్కెట్ ఆథరైజేషన్ కోసం కేంద్రానికి సీరం దరఖాస్తు
By: Tupaki Desk | 1 Jan 2022 4:12 AM GMTభారత్ లో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సంస్థ అయిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ ఇప్పటి వరకు కొవిషీల్ట్ అనే వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తు వస్తుంది. అయితే ఈ టీకాకు సంబంధించిన మార్కెట్ హక్కులను భారత్ లో తమకు ఇవ్వాలని సదరు సంస్థ సంబంధిత నియంత్రణా సంస్థలకు దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
మార్కెట్ హక్కుల కోసం తాము ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు అప్లై చేసుకున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేగాకుండా నియంత్రణ సంస్థ అయిన డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు ఈ మేరకు స్పష్టం చేశారు. అదర్ పూనావాలా చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం మార్కెట్ అనుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర కావాల్సిన డేటా ఉందని ఆయన తెలిపారు.
కాబట్టి తమ కంపెనీకు పుల్ మార్కెట్ ఆథరైజేషన్ ఇవ్వవచ్చని అన్నారు. ఇదిలా ఉండే దేశ వ్యాప్తంగా సీరం కంపెనీ ఉత్పత్తి చేసిన సుమారు 125 కోట్ల డోసులు మన దేశంలోని ప్రజలకు ఇచ్చినట్లు ఈ మేరుక సంస్థ సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. ఇదే విషయాని ఆయన చేసిన ట్వీట్ లో కూడా పేర్కొన్నారు.
కరోనా వైరస్ ను అడ్డుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుగా అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చింది. వాటిలో ఒకటి కొవాగ్జిన్ కాగా మరో కొవిషీల్డ్. భారత్ లో ఎక్కువ శాతం వ్యాక్సినేషన్ అంతా ఈ టీకాలతోనే నడిచింది. ఇటీవల కాలంలో ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వ నుంచి ఆడర్లు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఈ సంస్థ కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను సుమారు 50 శాతం మేర తగ్గించిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
సీరం సంస్థ కొవిషీల్డ్ తో పాటు మరో కరోనా వ్యాక్సిన్ ను కూడా తయారు చేస్తుంది. ఇది అమెరికాకు చెందిన కొవావ్యాక్స్ అనే వ్యాక్సిన్ ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్లకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి కరోనాను ఎదుర్కొవడంలో కీలక పాత్ర పోషించిందని సీరంను అభినందించాల్సి అవసరం ఉంది.