Begin typing your search above and press return to search.

విద్యార్ధులకి కేంద్రం బంపర్ ఆఫర్..లాప్‌ టాప్స్ - ఫోన్స్ ఫ్రీ!

By:  Tupaki Desk   |   3 July 2020 2:30 AM GMT
విద్యార్ధులకి కేంద్రం బంపర్ ఆఫర్..లాప్‌ టాప్స్ - ఫోన్స్  ఫ్రీ!
X
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. విద్యార్థులందరికీ ఫ్రీగా ల్యాప్‌ టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో స్టూడెంట్స్ డిజిటల్ విద్యను అందించాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుంది. అయితే , ఆన్ ‌లైన్ క్లాసులు వినాలన్నా, కోర్సులు పూర్తి చేయాలన్నా విద్యార్థులకు సొంతంగా డిజిటల్ డివైజ్‌లు అవసరం.

దీనితో రూ.15 వేలు విలువ చేసే సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందించాలని మానవ వనరుల అభివృద్ది శాఖ ప్రతిపాదించింది. వచ్చే 5 ఏళ్లలో దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో ఎన్ ‌రోల్ అయ్యే విద్యార్థుల్లో 40 శాతం మందికి ఉచితంగా డిజిటల్ డివైజ్ ‌లు ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.

కాగా, 2025-26 నాటికి దేశంలోని 4 కోట్ల మంది స్టూడెంట్స్‌ కి ల్యాప్‌ టాప్స్, ట్యాబ్లెట్, ఫోన్స్, టెలివిజన్ సెట్స్ లాంటివి ఇవ్వనుంది కేంద్రం. దీని కోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ.60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.36,473 కోట్లను ఖర్చు చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాలి. దీని ద్వారా 4 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం తెలిపింది.