Begin typing your search above and press return to search.

జీఎస్టీ ఇవ్వలేం.. రాష్ట్రాలకు కేంద్రం షాక్

By:  Tupaki Desk   |   30 July 2020 11:50 AM GMT
జీఎస్టీ ఇవ్వలేం.. రాష్ట్రాలకు కేంద్రం షాక్
X
కేంద్రం చావు కబురు చల్లాగా చెప్పేసింది. రాష్ట్రాలకు ఇకపై జీఎస్టీ పన్నుకు సంబంధించి భవిష్యత్ లో పరిహారం చెల్లించలేమని పార్లమెంటరీ ప్యానెల్ కమిటీకి ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషన్ తెలిపారు.

రెవెన్యూ రాబడులు ఆధారంగా రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లించేవారమని.. కానీ ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల పన్ను వసూల్ మందగించడమే కారణం అని ఆర్థిక శాఖ కార్యదర్శి తెలిపారు.

జీఎస్టీ చట్టానికి అనుగుణంగా జీఎస్టీ రాబడుల్లో రాష్ట్రాల వాటాను చెల్లించేందుకు ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేదని కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. కొన్ని వస్తువలపై పన్నులు పెంచడం.. పన్ను పరిధిలోకి మినహాయించిన వస్తు సేవలను తీసుకురావడంతో దీన్ని భర్తీ చేయలేకపోతున్నట్టు వివరించింది.

కేంద్రం ప్రకటనపై పార్లమెంటరీ కమిటీలోని విపక్ష సభ్యులు విరుచుకుపడుతున్నారు. కరోనాతో చితికిపోయిన రాష్ట్రాలను ఆదుకోవాలని.. జీఎస్టీ బకాయిలను చెల్లించాలని విపక్షాలు కోరుతున్నాయి.