Begin typing your search above and press return to search.
బిగ్ సేల్స్..బిగ్ షాక్! అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్రం దిమ్మతిరిగే పంచ్..
By: Tupaki Desk | 17 Oct 2020 8:50 AM GMTపండుగల సేల్ లో హడావుడిగా ఉన్న అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్ర ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. వస్తువుల అమ్మకాల్లో నిబంధనలు పాటించని కారణంగా నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. దసరా, దీపావళి మనదేశంలో జరుపుకునే అతి పెద్ద పండుగలు. దసరా నవరాత్రి ఉత్సవాలు పది రోజులు వైభవంగా జరుగుతాయి. దీపావళి వేడుకలు కూడా మూడు రోజుల పాటు జరుగుతాయి. పండుగల సంబరాన ఇంటిల్లిపాదికి దుస్తులు, ఇతర సామాగ్రి కోసం జనం ఇప్పటి నుంచే షాపింగ్ చేస్తున్నారు.
ఈ రెండు సంస్థలు జనాన్ని ఆకట్టుకోవడానికి ప్రచార హోరులో నిమగ్నమై ఉండగా ఈ రెండు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఒక వస్తువును అమ్మడానికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన మూలం, ఏ దేశంలో తయారైందన్న విషయాన్ని వినియోగదారుడికి తెలియజేయాలన్న తప్పనిసరి నిబంధనను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ విస్మరించాయని కేంద్రం ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. అతి పెద్ద పండగల సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ-కామర్స్ సంస్థలు దిమ్మ తిరిగి పోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలను అమలు చేసేందుకు ఆ సంస్థలు సిద్ధమవుతున్నాయి.