Begin typing your search above and press return to search.
ఎస్సీ హోదా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
By: Tupaki Desk | 7 Oct 2022 6:25 AM GMTదళిత క్రిస్తియన్లు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించే విషయమై కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది. దశాబ్దాలుగా నడుస్తున్న ఒక సున్నితమైన సమస్యకు పరిష్కారం చూపించేదిశగా కేంద్రం ఒక కమిటి వేసింది. సుప్రింకోర్టు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో త్రిసభ్య కమీషన్ వేసింది. క్రైస్తవం, ముస్లిం మతంలోకి మారిన దళితులు ఎస్సీ హోదాను కోల్సోతున్నారు. అయితే తాము మతంమారినా తమకు ఎస్సీ హోదానే కంటిన్యు చేయాలని డిమాండు వినబడుతున్నాయి.
ప్రస్తుతం పై రెండు మతాల్లోకి మారిన ఎస్సీలు బీసీ కేటగిరిలోకి మారిపోతున్నారు. ఎందుకంటే క్రైస్తవం, ముస్లిం మైనారిటీలు ప్రస్తుతం బీసీ కేటగిరిలో ఉన్నాయి. కాబట్టి పై రెండు మతాల్లోకి మారిన దళితులు ఆటోమేటిగ్గా బీసీలుగా మారిపోతున్నారు.
అయితే తాము మతం మారినా జన్మతహా వచ్చిన ఎస్సీ హోదానే కంటిన్యు అవ్వాలని దేశంలో అనేకమంది డిమాండ్లు చేస్తున్నారు. దీనిపై అనేక న్యాయస్ధానాల్లో కేసులు కూడా దాఖలయ్యాయి, విచారణ జరుగుతున్నది.
ఇదే విషయమై సుప్రింకోర్టులో ఈ వారంలో కేసు విచారణకు రాబోతున్నది. ఈ నేపధ్యంలోనే కేంద్రప్రభుత్వం జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమీషన్ వేసింది. సమస్యపై ఈ కమీషన్ అధ్యయనం చేసి, నిపుణుల అభిప్రాయాలు తీసుకుని తర నివేదికను ఇచ్చేందుకు రెండేళ్ళ కాలపరిమితి విధించింది.
అంటే ఈ కమీషన్ ఇచ్చే రిపోర్టు మీదే క్రిస్తియన్, ముస్లిం మతాల్లోకి మారిన దళితులు బీసీలుగానే ఉండాలా ? లేకపోతే ఎస్సీలుగానే కంటిన్యు అవ్వచ్చా ? అనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
మతాలు మారిన వారికి ఎస్సీ హోదానే కంటిన్యు చేస్తే ఎస్సీలకు ఏమన్నా అన్యాయం జరుగుతుందా ? వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది ? లాంటి అనేక అంశాలను ఈ కమీషన్ అధ్యయనం చేస్తుంది. మరి రెండేళ్ళల్లో కమీషన్ తన రిపోర్టును ఇస్తుందా లేకపోతే గడువు పొడిగింపు కోరుతుందా అన్నది చూడాలి. ఏదేమైనా దీర్ఘకాల సమస్యకు పరిష్కారమైతే దొరుకుతుందనే అనుకోవాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.