Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   22 Oct 2020 5:33 PM GMT
అంతర్జాతీయ రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X
ఎప్పుడైతే దేశంలో కరోనా ఎంట్రీ అయ్యిందో అప్పటి నుంచే దేశంలో విదేశాల నుంచి రాకపోకలను కేంద్రం నిషేధించింది. వందే భారత్ మిషన్ అంటూ అప్పట్లో నడిపింది. కరోనా బాగా ప్రబలడంతో ఇక చేసేందేం లేక మొత్తం విమానాల రాకపోకలు ఆ మధ్య బంద్ చేసింది. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని మాత్రమే ప్రత్యేక విమానాలు వేసి తీసుకొచ్చింది.

తాజాగా అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలోకి ఇతర దేశాల నుంచి భారతీయులు.. విదేశీయుల రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. పర్యాటక వీసా మినహా అన్ని వర్గాల ప్రయాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే ప్రయాణికులంతా ఆరోగ్యశాఖ సూచించిన ప్రకారం క్వారంటైన్ తదితర కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, భారత మూలాలున్న భారతీయులతోపాటు విదేశీయులు ఎవరైనా వాయు, జల మార్గాల ద్వారా భారత్ కు వచ్చేందుకు కేంద్ర హోంశాఖ అనుమతులు జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి రావచ్చు.. భారత్ నుంచి విదేశాలకు వెళ్లవచ్చని పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న వీసాలన్నింటిని యాక్టివ్ చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎలక్ట్రానిక్, పర్యాటక, వైద్య సంబంధ వీసాలు మినహా ఇతర అన్ని వీసాలను కేంద్రం పునరుద్ధరించింది.భారత్ లో చికిత్స కోసం మెడికల్ వీసాలను కేంద్ర హోంశాఖ మంజూరు చేస్తోంది.