Begin typing your search above and press return to search.
రాజీవ్ హత్య కేసులో దోషుల రిలీజ్ పై కేంద్రం సరికొత్త ట్విస్టు
By: Tupaki Desk | 18 Nov 2022 3:47 AM GMTమాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన దారుణ ఉదంతానికి సంబంధించి దోషులుగా ఉన్న వారి విడుదలపై ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. వారిని విడుదల చేయాలని పేర్కొనటం తెలిసిందే. దీంతో.. దశాబ్దాల తరబడి జైల్లో ఉన్న వారు బయటకు రావటం తెలిసిందే. అయితే.. ఈ ఉదంతంలో అనుకోని పరిణామం చోటు చేసుకుంది. రాజీవ్ హత్య కేసులో దోషులైన వారిని విడుదలకు సంబంధించి తనకున్న అభ్యంతరాల్ని పేర్కొంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దోషుల విడుదల నిర్ణయాన్ని పున:సమీక్షించాలని కోరుతూ తాజాగా ఒక పిటిషన్ ను సుప్రీంలో దాఖలు చేసింది మోడీ సర్కార్. దోషుల విడుదల తగిన విచారణ జరగకుండానే జరిగిందని.. ఇలా చేయటం న్యాయసూత్రాల్ని ఉల్లంఘించటమే అవుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా వారి జైలు జీవితం తమిళనాడులో రాజకీయ సమస్యగా మారినట్లుగా పేర్కొన్న కేంద్రం.. ఇలాంటి సున్నితమైన అంశాల్లో కేంద్రం సలహాను తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంక దేశానికి చెందిన వారు కాగా.. వారంతా ఉగ్రవాదులుగా ముద్ర పడిన వారికి క్షమాభిక్ష పెట్టటం అంతర్జాతీయంగా ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. ఈ కేసులో కేంద్రం కూడా ఒక భాగమేనని స్పష్టం చేస్తూ.. తమ వాదనను వినకుండా వారిని విడుదల చేయటం సబబు కాదని పేర్కొంది. విడుదల వ్యవహారంలో కేంద్రాన్ని ఇంప్లీడ్ చేయకుండా దోషుల శిక్ష తగ్గింపు కోరటం.. దానిపై కేంద్రాన్ని సలహా అడగకుండా సుప్రీం నిర్ణయాన్ని తీసుకోవటాన్ని తప్పు పడుతూ పిటిషన్ దాఖలు చేసింది.
మరి.. ఈ వ్యవహారంపై సుప్రీం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి. మరో వైపు వారిని బాధిత కుటుంబం సోనియా వారి కుటుంబ సభ్యులు క్షమించినా.. తాము మాత్రం వారిని క్షమించలేమని కాంగ్రెస్ స్పష్టం చేయటం తెలిసిందే. మరోవైపు ముప్ఫై ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవించిన వారి విడుదలపై తమిళనాడు అధికారపక్షమైన డీఎంకే.. విపక్షంలో ఉన్న అన్నాడీఎంకేలు స్వాగతించటం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.