Begin typing your search above and press return to search.

ట్విట్టర్ కు మరో షాకిచ్చిన కేంద్రం

By:  Tupaki Desk   |   15 Jun 2021 11:07 AM GMT
ట్విట్టర్ కు మరో షాకిచ్చిన కేంద్రం
X
ట్విట్టర్ కు కేంద్రం మరోసారి షాకిచ్చింది. కొత్త ఐటీ నిబంధనలు అమలు చేయలేదని మరోసారి నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈనెల 18న హాజరు కావాలని ట్విట్టర్ కు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఈ నోటీసులు జారీ చేసింది.

దేశంలో మోడీ సర్కార్ తెచ్చిన కొత్త ఐటీ నిబంధనలు అమలుచేయకపోవడంపై ట్విట్టర్ పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇదే తుది నోటీసులుగా పేర్కొంది. పదే పదే నోటీసులు ఇచ్చినా కూడా వివరణ ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైందని కేంద్ర ఐటీ శాఖ మండిపడింది.

సోషల్ మీడియా, ఆన్ లైన్ వార్తలను దుర్వినియోగం చేసినందుకు గాను కమిటీ తాజాగా నోటీసులు జారీ చేసింది. జూన్ 18న సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్ లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని తెలిపింది.మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతోపాటు, ఫేక్ న్యూస్ నివారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలని కూడా కమిటీ ఈ నోటీసుల్లో కోరింది.

ట్విట్టర్ కు, కేంద్రప్రభుత్వానికి మధ్య కొద్దిరోజులుగా యుద్ధమే నడుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ట్విట్టర్ లో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల వాడి ఎక్కువవడం.. వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తోందన్న ట్విట్టర్ తీరుపై కేంద్రం సీరియస్ గా ఉంది.. దేశంలో బాధ్యులను నియమించకుండా.. కేంద్రప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ట్విట్టర్ పై ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా నోటీసులు జారీ చేసి షాకిచ్చింది.