Begin typing your search above and press return to search.

క‌శ్మీర్ కు 10వేల అద‌న‌పు బ‌ల‌గాలు..ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   27 July 2019 2:30 PM GMT
క‌శ్మీర్ కు 10వేల అద‌న‌పు బ‌ల‌గాలు..ఏం జ‌రుగుతోంది?
X
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణ‌యం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ఉండ‌ట‌మే కాదు.. కొత్త చ‌ర్చ‌కు తెర తీసేలా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. పేరుకు ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్ని ముమ్మ‌రం చేసేందుకు తాము క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు చెబుతున్న మోడీ స‌ర్కారు.. తాజాగా జ‌మ్ముక‌శ్మీర్ కు 10 వేల మంది సైనికుల‌తో కూడిన 100 కంపెనీల సైనిక ద‌ళాల్ని పంప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇటీవ‌ల క‌శ్మీర్ లోయ‌లో రెండు రోజులు ప‌ర్య‌టించిన జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ డోవ‌ల్ అనంత‌రం శాంతిభ‌ద్ర‌త‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఇది జ‌రిగిన వెంట‌నే ఇంత భారీగా సైనికుల్ని త‌ర‌లిస్తున్న వైనం ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీసే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై ఎక్కువ విశ్లేష‌ణ‌లు అక్క‌ర్లేద‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న మేర‌కే కేంద్రం అద‌న‌పు బ‌ల‌గాల్ని మొహ‌రిస్తున్న‌ట్లుగా రాష్ట్ర డీజీ దిల్ బాగ్ సింగ్ చెప్ప‌టం గ‌మ‌నార్హం.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వాయు మార్గంలో సైనికుల్ని ఇంత భారీ ఎత్తున క‌శ్మీర్ కు త‌ర‌లిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఈ మ‌ధ్య‌నే అమ‌ర్ నాథ్ యాత్ర కోసం వివిధ ప్రాంతాల నుంచి 40 వేల మంది అద‌న‌పు బ‌ల‌గాల్ని క‌శ్మీర్ కు త‌ర‌లించారు. తాజాగా పంపుతున్న బ‌ల‌గాల‌తో మొత్తం 50 వేల మందితో కూడిన భారీ సైనిక ద‌ళం ఇప్పుడు క‌శ్మీర్ లో ఉంద‌ని చెప్పాలి. తాజా మొహ‌రింపుపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే.. ఈ సంద‌ర్భంగా వ‌చ్చే ఊహాగానాల‌న్ని ప‌ట్టించుకోకూడ‌నివిగా చెబుతున్నారు జ‌మ్ముక‌శ్మీర్ డీజీ.

ఇదిలా ఉంటే.. ఇక్క‌డో ఆస‌క్తిక‌ర అంశాన్ని ప్ర‌స్తావించాలి. కార్గిల్ యుద్ధం జ‌రిగి నిన్న‌టితో 20 ఏళ్లు. ఈ సంద‌ర్భంగా వీరుల త్యాగాల్ని స్మ‌రించిన ప్ర‌ముఖుల వ్యాఖ్య‌లు ఒక‌లా ఉంటే.. ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ చేసిన వ్యాఖ్య‌ల్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

అక్ర‌మిత క‌శ్మీర్ తో స‌హా మొత్తం జ‌మ్ముక‌శ్మీర్ భార‌త్ దేన‌ని.. దానిపై పూర్తి హ‌క్కులు త‌మ‌కే ఉంటాయ‌ని.. అదెలా అన్న‌ది రాజ‌కీయంగా తీసుకోవాల్సిన నిర్ణ‌యంగా ఆయ‌న నోటి నుంచి మాట‌లు రావ‌టం గ‌మనార్హం. వాస్త‌వానికి బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు కేంద్రంలో ఉన్న వేళ‌ల్లో ఎప్పుడూ ఆర్మీ చీఫ్ లు ఇంత గ‌ట్టిగా మాట్లాడ‌టం ఉండేది కాదు. అందుకు భిన్నంగా మోడీ ప్ర‌భుత్వంలో మాత్రం ఆర్మీ చీఫ్ లు త‌మ వాణిని వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.