Begin typing your search above and press return to search.
కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్రం సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 12 April 2021 12:30 AM GMTదేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణకు వాడే రెమిడెసివిర్ మందుల ఎగుమతులపై నిషేధం విధించింది. వెంటనే ఔషధ నిల్వల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాలని.. రెమిడెసివిర్ నల్ల బజారుకు తరలకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
దేశంలో కరోనా రెండో వేవ్ రావడం.. కేసులు జెట్ స్పీడ్ గా పెరుగుతున్న దృష్ట్యా రెమెడెసివిర్ ను ఔషధ తయారీ సంస్థలు ఎగుమతి చేయవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఈ డ్రగ్ కు డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం ఎగుమతులు కొనసాగుతున్నాయి.
11వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజురోజుకి ఈ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. దీంతో రెమెడిసివిర్ కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
ఉత్పత్తిదారులు, పంపిణీదారులు రెమెడెసివిర్ నిల్వలు దాచొద్దని.. ఔషధ నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని కేంద్రం పేర్కొంది. అలాగే బ్లాక్ మార్కెట్ కు ఈ ఔషధం తరలకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ మేరకు డ్రగ్ ఇన్ స్పెక్టర్లు, ఇతర అధికారులు ఔషధ నిల్వలను వెంటనే తనిఖీలు చేయాలని కేంద్రం ప్రకటనలో పేర్కొంది.