Begin typing your search above and press return to search.
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ మీద కేంద్రం సీరియస్ స్టెప్...?
By: Tupaki Desk | 10 Nov 2022 1:30 PM GMTతెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ మీద ఇపుడు వాడి వేడిగా రాజకీయ దుమారం రేగుతోంది. ఏకంగా రాష్ట్ర గవర్నర్ తమిల్ సై తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అంటూ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ కి తుషార్ అన్న వ్యక్తి నుంచి మెసేజ్ రాగానే ఫాం హౌస్ కేసులో ఉన్న తుషార్ అని టీయారెస్ నేతలు ఆరోపించారని గుర్తు చేస్తూ మండిపడ్డారు.
మరి తన ఫోన్ కి వచ్చిన మేసేజులు టీయారెస్ నేతలకు ఎలా తెలుస్తున్నాయని ఆమె గట్టిగానే ప్రశ్నించారు. అంటే దీనిని బట్టి తన ఫోన్ ని ట్యాప్ చేస్తున్నారు అని ఆమె ఆరోపిస్తున్నట్లుగానే ఉంది. ఇక పోలీసులు ఫోన్ ట్యాప్ చేయవచ్చు కానీ అది అసాంఘిక శక్తులు కానీ లేక ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారం కోసం కానీ టెలిఫోన్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాప్ చేయవచ్చు. అయితే ఇపుడు ఏకంగా కీలక నాయకులు రాజకీయ ప్రత్యర్ధులు అయిన వారు ఆఖరుకు గవర్నర్ మీద కూడా ఫోన్ ట్యాప్ వల విసిరారా అన్నదే చర్చగా ఉంది అంటున్నారు.
ఇక బీజేపీ నేతలు కూడా తమ ఫోన్ ట్యాపింగ్ అవుతోందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణాలో విపక్షాలు అన్నీ కూడా కేసీయార్ సర్కార్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తోంది అని ఆరోపించడం విశేషం. దీని మీద కోర్టులో కేసులు కూడా ఉన్నాయి. అనేక రకాలైన పిటిషన్లు ఇపుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దాఖలు అయ్యాయి.
ఇవన్నీ ఇలా ఉంటే ఆ మధ్య మోదీ రైతు చట్టాలను రద్దు చేస్తున్నారు అన్నది కనీసం ఎవరికీ కూడా తెలియదు. కానీ కేసీయార్ మాత్రం చాలా ముందుగానే ఈ విషయాన్ని ఊహించారు అని అంటున్నారు. ఆయన ఎలా ఊహించారు అన్నదే అప్పట్లో చర్చ సాగింది. తాము రైతుల చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ కి తలొగ్గి కేంద్రం వాటిని రద్దు చేస్తోందని ఆయన చెప్పుకున్నారు.
ఆ తరువాత మోడీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేసింది. అయితే కేసీయార్ కి ఈ విషయం ఎలా తెలిసింది అన్నది అప్పటికీ ఇప్పటికీ ఒక ఆసక్తికరమైన పాయింట్ గానే ఉంది మరి. ఈ ఒక్క విషయం కాదు చాలా విషయాల్లో కేసీయార్ కి చాలా మంది కంటే ముందే కీలకమైన సమాచరం వస్తోంది అని అంటున్నారు. ఆయనకు అలాంటి సోర్సులు అన్నీ ఉన్నాయని కూడా అనుకుంటున్నారు.
అయితే ఇపుడు వాటి సంగతి ఎలా ఉన్నా ఫోన్ ట్యాపింగ్ కేసులు మాత్రం కేసీయార్ సర్కార్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు. ఈ విషయంలో వరసబెట్టి వస్తున్న ఆరోపణతో కేంద్రం కూడా సీరియస్ గానే ఉందని అంటున్నారు. కేంద్రం సీక్రెక్ట్ గా విచారణ జరిపిస్తోంది అని కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఒక వైపు కోర్టులో కేసులు పడ్డాయి. దాని మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునంటో చూడాలి. కోర్టు కనుక విచారణకు ఆరోపిస్తే మాత్రం ఫోన్ ట్యాపింగ్ నిగ్గు అధికారికంగా తేలుతుంది. లేకపోతే కేంద్రం సీక్రెట్ విచారణ జరిపి దీని వెనక లోగుట్టు ఏంటి అన్నది బట్టబయలు చేస్తుంది అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే కనుక నిజంగా కేసీయార్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిందా అలా జరిగితే అపుడు కేసీయార్ సర్కార్ మీద ఎలాంటి యాక్షన్ కి కేంద్రం దిగుతుంది ఇవన్నీ ప్రశ్నలే. వీటి కంటే ముందు మరో మాట కూడా చెప్పాలి. 2015లో నాటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా తన ఫోన్లను ట్యాప్ చేశారంటూ ఆరోపించారు. దీనిని బట్టి చూస్తే ఫోన్ ట్యాపింగ్ కధకు చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.