Begin typing your search above and press return to search.
తిరుమలపై కుదరదన్న నిర్మల..జగన్ సర్కార్ కు షాక్
By: Tupaki Desk | 25 March 2021 7:03 AM GMTతిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వైసీపీ సర్కార్ కేంద్రం మరో ఝలక్ ఇచ్చింది. ఓ కీలక డిమాండ్ పై ఎంతోకాలంగా పోరాడుతున్న ఏపీ ప్రభుత్వానికి పార్లమెంట్ సాక్షిగా నో చెప్పింది.
ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ తోపాటు ప్రత్యేక హోదా వంటి విభజన హామీల విషయంలోనూ పార్లమెంట్ లో వరుస షాకులు ఇస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల.. టీటీడీ విషయంలోనూ నో చెప్పేయడంతో ఇప్పుడు వైసీపీ ఎంపీలు నిట్టూరుస్తున్నారు.
ఏటా తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తులు సమర్పించే విరాళాలతోపాటు వసతిగృహాల అద్దెలు, లడ్డూ ప్రసాదంలో వాడే సామాగ్రిపై జీఎస్టీ బాదుడు భారీగా పెరిగిపోయింది.దీంతో టీటీడీకి జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని వైసీపీ సర్కారు కేంద్రాన్ని పదే పదే కోరింది.
తాజాగా పార్లమెంటులో ద్రవ్యబిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీలు మరోసారి ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కానీ టీటీడీకి జీఎస్టీ మినహాయింపు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ససేమిరా అన్నారు. వైసీపీ ఎంపీలకు నిరాశ తప్పలేదు.
దేశంలో ఇతర గుళ్లకు జీఎస్టీ మినహాయింపు లేదని.. టీటీడీకి ప్రత్యేకంగా మినహాయింపులు ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల స్పష్టం చేశారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపీకి షాక్ తగిలింది..