Begin typing your search above and press return to search.
కేసీఆర్‌పై కేంద్రం కత్తి.. 14 వేల కోట్లకు ఎసరు!
By: Tupaki Desk | 18 Jun 2022 2:30 AM GMTకేసీఆర్ దూకుడుకు కేంద్రం పగ్గాలు వేస్తోందా? ఆర్థికంగా.. కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా.. కేంద్రం వ్యూహా త్మకంగా అడుగులు వేస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం తీసుకునే అప్పుల మొత్తంలో కోత పడనుంది. కేంద్రం అభ్యంతరం చెబుతున్న బడ్జెటేతర రుణాలను నాలుగేళ్ల కాలానికి సర్దుబాటుచేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ప్రతిపాదిత రుణాల్లో రూ. 14 వేల కోట్ల వరకు తగ్గే పరిస్థితి ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం... ఎంత మొత్తం అప్పుల ద్వారా సమీకరించుకోవాలన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. బడ్జెటేతర రుణాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్న కేంద్రం ఎఫ్ఆర్బీఎమ్ పరిధిలోకి లోబడి.. బాండ్ల జారీద్వారా తీసుకునే అప్పుల మొత్తాన్ని తేల్చలేదు. కేంద్రం లేవనెత్తి న అభ్యంతరాలకు ఇప్పటికే సమాధానాలిచ్చిన రాష్ట్రం.. ఎఫ్ఆర్బీఎమ్ కి లోబడి తీసుకున్న రుణాలతో పాటు బడ్జెట్ వెలుపల వివిధకార్పోరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించింది.
వాటిని అలానే చూస్తాం!ఆర్థికశాఖ ఉన్నతాధికారులు రెండు దఫాలుగా ఢిల్లీ వెళ్లి... కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. గడచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేంద్రం.. ఆ చెల్లింపులను బడ్జెట్ నుంచే చేస్తున్నందున వాటిని ఎఫ్ఆర్బీఎమ్ కిందే పరిగణి స్తామని అంటోంది.
ఆ తరహా రుణాలు గత రెండు ఆర్థికసంవత్సరాల్లో రూ. 57వేల కోట్ల వరకు ఉన్నాయి. ఐతే... ఆ మొత్తాన్ని ఒకే ఏడాదికి కాకుండా నాలుగేళ్ల ఎఫ్ఆర్బీఎమ్ రుణాల్లో సర్దుబాటు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించినట్లు సమాచారం.
అంటే 57 వేల కోట్ల అప్పు మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు ఎఫ్ఆర్బీఎమ్ అప్పుల్లో భాగంగా పరిగణిస్తారు. ఆ మేరకు... రూ. 14వేల కోట్లను ఏటా బడ్జెట్‌లో ప్రతిపాదించిన అప్పుల్లో కోతవిధిస్తారు. అదే జరిగితే.. రాష్ట్రప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రతిపాదించిన 53వేల కోట్లలో 14వేల కోట్లను తగ్గిస్తారు. మిగతా మొత్తానికి అనుమతిచ్చే అవకాశం ఉంది.
వాటికి అదనంగా ఉదయ్ పథకంలో భాగంగా డిస్కంల రుణాలకు చెందిన అప్పులతో పాటు... ఇతరాలను ఎఫ్ఆర్బీఎమ్ రుణాల్లో భాగంగానే చూస్తామని... కేంద్రం చెబుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రతిపాదిత అప్పుల మొత్తంలో భారీగా కోత పడనుంది. మరి దీనిపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.