Begin typing your search above and press return to search.

ట్విట్టర్ కి కేంద్రం షాక్ .. తొలికేసు నమోదు ఎక్కడంటే..?

By:  Tupaki Desk   |   16 Jun 2021 11:30 AM GMT
ట్విట్టర్ కి కేంద్రం షాక్ .. తొలికేసు నమోదు ఎక్కడంటే..?
X
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కి కేంద్రం షాక్ ఇచ్చింది. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ భారత్‌ లో ఉన్న చట్టపరమైన రక్షణ (మధ్యవర్తి హోదా)ను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్లు బుధవారం వెల్లడించనుంది. దీనితో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విటర్‌ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలను ట్విట్టర్ ఎదుర్కోవాల్సిఉంది. కొత్త ఐటీ నిబంధనల అమలుపై ట్విట్టర్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోంది.

దీనితో సోషల్ మీడియా మధ్యవర్తిగా ఉండాల్సిన రక్షణను ట్విటర్ కోల్పోయిందని, దీంతో ఇకపై భారత చట్టాల పరంగా చర్యలు తీసుకోవచ్చునని ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక మధ్యవర్తి హోదా ఎత్తివేసిన కొద్దీ గంటల్లోనే ఉత్తరప్రదేశ్‌ లో ట్విటర్‌ పై తొలి కేసు కూడా నమోదవడం గమనార్హం. మతపరమైన హింసను ప్రోత్సహిస్తున్నారంటూ కొంతమంది జర్నలిస్టులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. జూన్ 5న వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఉత్తర ప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ లో థర్డ్ పార్టీకి సంబంధించిన మొదటి కేసు నమోదైంది. అభ్యంతరకర, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించమని చెప్పినా ట్విట్టర్ తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా భారత్‌లో ఈ హోదా కోల్పోతున్న తొలి సోషల్ మీడియా ఇదే.