Begin typing your search above and press return to search.

పాక్ చేతిలో ఓటమి: బౌలర్ అర్షదీప్ వ్యవహారంపై కేంద్రం ఆగ్రహం.. సమన్లు జారీ

By:  Tupaki Desk   |   8 Sep 2022 6:04 AM GMT
పాక్ చేతిలో ఓటమి: బౌలర్ అర్షదీప్ వ్యవహారంపై కేంద్రం ఆగ్రహం.. సమన్లు జారీ
X
ఆట అన్నాక గెలుపోటములు సహజం. ఆ ఎమోషన్ ను అందరూ కంట్రోల్ చేసుకోవాలి. కానీ అది సాధ్యమయ్యే పని కాదు.. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ సమరాల్లో ఓటమిని ఎవరూ జీర్ణించుకోరు. అస్సలు తట్టుకోలేరు. ఓడిపించిన ఆటగాళ్ల ఊసురు తీసేలా ట్రోల్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో నానా రకాల చిత్రహింసలకు గురిచేస్తుంటారు.

పాకిస్తాన్ పై ప్రతీసారి టీమిండియానే గెలవాలన్న కసి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఓడిపోయినట్టు తట్టుకోలేరు. ఆక్రీడా స్ఫూర్తి చాలా మందిలో లోపిస్తోంది. తాజాగా ఆసియాకప్ లోని సూపర్ 4 దశలో పాక్ తో మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత కొందరు ప్రేక్షకులు దారుణ కామెంట్లతో ఎగతాళి చేశారు. శృతిమించి ప్రవర్తించారు. అది ఇప్పుడు కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ ఆరోపణలు చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేయడానికి సిద్ధమైంది.

దుబాయి వేదికగా ఆసియా కప్ జరుగుతోంది. లీగ్ దశలో టీమిండియా పాకిస్తాన్, హాంకాంగ్ లపై గెలిచి సూపర్ 4లోకి ప్రవేశించింది. అయితే సూపర్ 4లో చివరి నిమిషంలో పాకిస్తాన్ చేతిలో ఓడి ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో సులువైన క్యాచ్ ను మన టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ వదిలేశాడు. అనంతరం చివరి ఓవర్ లోనూ పొరపాట్లు చేసి భారత ఓటమికి కారణమయ్యాడు.

దీంతో కొందరు ఆకతాయిలు మాత్రం అర్షదీప్ ను టార్గెట్ చేసి అతడిపై దాడి చేస్తామని.. చంపేస్తామని.. అతడికి నిషేధిత సంస్థ ‘ఖలిస్తాన్’తో సంబంధముందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వికీపీడియాలో భారత్ బదులు ఖలిస్తాన్ అని ఎడిట్ చేశారు. దీంతో పెనుదుమారం చెలరేగింది.

ఈ విషయంపై సీరియస్ అయిన కేంద్రం.. వికీపీడియా పేజీలో చోటుచేసుకున్న తప్పు సమాచారంతో మత సామరస్యం దెబ్బతింటుందని.. అర్షదీప్ కుటుంబానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వికిపీడియా భారత ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. తప్పుడు సమాచారం ప్రచురితమైన విషయమై వివరణ ఇవ్వాలని కోరింది.

ఇది జరిగిన 15 నిమిషాల్లోనే వికీపీడియా ఎడిటర్స్ అర్షదీప్ ప్రొఫైల్ ను సరిచేశారు. ఈ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారానికి దారితీసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.