Begin typing your search above and press return to search.
జగన్ కు ఊరట, బాబు కు షాక్: మండలి రద్దు పై కేంద్రం నిర్ణయం
By: Tupaki Desk | 28 Jan 2020 4:08 AM GMTఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు కోసం శాసన సభ తీర్మానం చేయడంపై బీజేపీ నేతలు కీలక ప్రకటనలు చేశారు. అసెంబ్లీలో 133 మంది ఎమ్మెల్యేలు మండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేసారు. దీనిని కేంద్రానికి పంపిస్తారు. ఉభయ సభల తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో మండలి రద్దు పూర్తవుతుంది. శాసన సభ తీర్మానం నేపథ్యం లో మోడీ ప్రభుత్వం నిర్ణయం పై అందరూ ఉత్కంఠగా ఉన్నారు.
ఈ సమయంలో బీజేపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దుపై ఏపీ కమలదళం అగ్రహం వ్యక్తం చేస్తోంది. మండలి రద్దు దురదృష్ట కరమని, జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. మండలి అవసరమే లేదన్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. నిర్మాణాత్మక చర్చలకు మండలి అవశ్యమన్నారు.
అయితే మండలి రద్దుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లో కేంద్రం జోక్యం చేసుకోదని కూడా స్పష్టం చేశారు. అసెంబ్లీ లో ఆమోదం పొందిన బిల్లు పార్లమెంటు లో ఆమోదం పొందడం లాంఛనమేనని, దీనికి ఇబ్బందులు, అడ్డంకులు ఉండవని తెలుగుదేశం పార్టీ కి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు.
సోమవారం మండలిని రద్దు చేస్తూ ఏపీ శాసన సభ తీర్మానం చేసింది. దీనిని కేంద్రానికి పంపించనున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11, రెండో విడత మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే మండలి రద్దు పార్లమెంటు ఉభయ సభల ముందుకు రావొచ్చునని అంటున్నారు.