Begin typing your search above and press return to search.
తిరుపతికి మోడీ ఇవ్వబోతున్న గిఫ్ట్ ఏమిటంటే..?
By: Tupaki Desk | 27 Nov 2019 8:30 AM GMTతిరుపతి కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన పుణ్యస్థలం. తిరుమల శ్రీ వారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు కొన్ని లక్షల మంది తిరుపతికి వస్తుంటారు. నిత్యం వచ్చే భక్తజనసంద్రాలతో తిరుమల గిరులు గోవిందనామ స్మరణతో గోరెత్తిపోతుంటుంది. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం కూడా రోజు కోట్లలోనే ఉండటం మరో విశేషం. అలాగే ఏదైన విశేషమైన పర్వదినాలలో రాజకీయ ప్రముఖులు , విఐపిలు - వివిఐపిలు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు.
ఇక ఈ నేపథ్యంలో తాజాగా దేశ ప్రధాని మోడీ ..తిరుపతికి గుడ్ న్యూస్ చెప్పారు. అదేమిటి ఆంటే ..శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు తిరుపతికి వీఐపీలు వస్తూ - పోతూ వుండడంతో రేణిగుంటలో ఉన్న తిరుపతి ఎయిర్ పోర్ట్ కి మెరుగులుదిద్దాలని బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి విమానాశ్రయంలో కొత్తగా వీఐపీ సెర్మోనియల్ లాంజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వీఐపీ సెర్మోనియల్ లాంజ్ నిర్మాణానికి అవసరమయ్యే ఎయిర్ పోర్టు భూమిని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు లీజుకు ఇవ్వాలని కంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే ఎయిర్ పోర్టు పరిధిలోని 1800 చదరపు మీటర్ల భూమిని భారత విమానాశ్రయాల ప్రాదికార సంస్థ ఏపీ కార్పొరేషన్ కు లీజుకు ఇవ్వనుంది. దీనికి ఏడాదికి కేవలం ఒక్క రూపాయి నామమాత్రపు లీజు ఫీజు చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు భూమి ఏపీ కార్పొరేషన్ కు బదిలీ కాగానే వీఐపీ సెర్మోనియల్ లాంజ్ నిర్మాణం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇకపోతే ఈమద్యే తిరుపతి ఎయిర్ పోర్ట్ ని అంతర్జాతీయ స్థాయికి అప్ గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిరుపతి నుండి కొలంబో - దుబాయ్ - కౌలాలంపూర్ లకు విమానాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ కొత్త లాంజ్ తిరుమలకి వచ్చే వీవీఐపీ - వీఐపీ కోసం నిర్మించనున్నారు.