Begin typing your search above and press return to search.
జేసీకి కేంద్ర మంత్రి పదవి..?
By: Tupaki Desk | 20 July 2017 10:09 AM GMTఏపీ టీడీపీలో కొత్త చర్చ మొదలైంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉపరాష్ర్టపతి పదవికి నామినేషన్ వేయడంతో మోడీ కేబినెట్లో ఖాళీ అయిన ఆయన స్థానాన్ని టీడీపీ నేతతో భర్తీ చేసేలా చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు సమాచారం. టీడీపీలో కేంద్ర మంత్రి పదవి కోసం ఆశావహులు చాలామందే ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివాదాస్పద నేత జేసీ దివాకరరెడ్డికి ఇవ్వాలని చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
నిజానికి వెంకయ్య పేరు ఉప రాష్ర్టపతి పదవికి వినిపించడానికి ముందునుంచే ఆ విషయం వెంకయ్యకు - చంద్రబాబుకు కూడా తెలుసని.. అలాంటి పరిస్థితి తప్పనిసరైతే సెంట్రల్ కేబినెట్లో జేసీకి స్థానమివ్వాలని తలపోసినట్లు తెలుస్తోంది. మనసులో కేంద్రమంత్రి పదవిపై ఎన్నో ఆశలున్న జేసీ తరచూ చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అయినప్పటికీ రాయలసీమలో రెడ్ల ఓట్ల కోసం జేసీపై ఎంతో కొంత ఆధారపడాల్సిన పరిస్థితి. పైగా రెడ్లను ఆకట్టుకునేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు యోచనగా తెలుస్తోంది.
అయితే... బస్సుల గొడవతో పాటు ఇటీవలే విమానయాన సంస్థలతో ఆయనకు ఏర్పడిన గొడవలు కాస్త ఆటంకంగా మారాయి. అందుకనే.. చంద్రబాబు ఈ గొడవను వీలైనంత తొందరగా సమసిపోయేలా చూసుకోవాలని జేసీకి సూచించారట. ఏం చేశారో ఏమో కానీ ఇండిగో సంస్థ ఇప్పటికే జేసీపై నిషేధం ఎత్తివేసింది. మిగతా సంస్థలూ అదే దారిలో ఉన్నట్లు వినిపిస్తోంది. ఇందుకు కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ సాయం కోసం జేసీ ట్రై చేస్తున్నట్లుగా వినిపిస్తోంది. చంద్రబాబు స్వయంగా కనుక అశోక్ తో మాట్లాడితే జేసీకి ఈ గొడవ తప్పుతుంది. ఆ తరువాత కొద్దిరోజుల పాటు సైలెంటుగా ఉంటూ ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటే మోడీని ఒప్పించి ఆయన కేబినెట్లో చేర్చేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నట్లుగా టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది.