Begin typing your search above and press return to search.

వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ .. ఏం చెప్పిందంటే ?

By:  Tupaki Desk   |   27 Nov 2021 9:32 AM GMT
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ .. ఏం చెప్పిందంటే ?
X
తెలంగాణ రాష్ట్ర ధాన్యం కొనుగోళ్ల పంచాయితీపై స్పష్టత వచ్చింది. వరిధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంతో చర్చించేందుకు ఇటీవలే సీఎ కేసీఆర్, మంత్రివర్గ బృందం ఢిల్లీకి వెళ్లింది. కానీ,ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

ఈ క్రమంలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

యాసంగిలో వరి పంట వెయ్యొద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సమావేశంలో గోయల్ వరి కొనుగోళ్లపై ఆయన స్పష్టత ఇచ్చినట్లుగా తెలిపారు నిరంజన్ రెడ్డి. వరి ధాన్యం కొనే ప్రసక్తే లేదని కేంద్రం ఖరాకండిగా చెప్పినట్లు మంత్రి వివరించారు.

మొదట వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. యాసంగిలో ఎంత మొత్తంలో ధాన్యం సేకరిస్తారో చెబితే రైతులకు స్పష్టత ఇస్తామని వెల్లడిస్తోంది. రెండు పంటల్లో కలిపి ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం ఒకేసారి తెలపాలని సూచిస్తోంది.

తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం పక్కకు పెట్టింది. ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో భేటీ ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి నిరంజ‌న్ రెడ్డి. తెలంగాణ రైతాంగ ప్ర‌యోజ‌నాల కోస‌మే కేంద్ర‌మంత్రిని క‌లిశామ‌న్నారు. మేము చాలా ఆశ‌తో ఈ స‌మావేశానికి వ‌చ్చాం.

కానీ, కేంద్ర ప్ర‌భుత్వం నిరాశే మిగిల్చిందని అన్నారు. స‌మావేశం అసంపూర్తిగా ముగిసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్ర‌భుత్వం నుంచి సానుకూల నిర్ణ‌యం రాలేదని అన్నారు. గ‌త వారం కూడా కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వ‌లేదని తెలిపారు. అయితే కేంద్రం మాత్రం తెలంగాణ లో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధర ప్రకారం కొంటున్నట్టు చెప్తుంది.