Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు స్వీట్ వార్నింగ్‌!... రిపీట్ కావొద్ద‌ట‌!

By:  Tupaki Desk   |   4 May 2019 4:02 AM GMT
కేసీఆర్‌ కు స్వీట్ వార్నింగ్‌!... రిపీట్ కావొద్ద‌ట‌!
X
టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓ వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్ లో కాస్తంత క‌రుకుత‌నం క‌నిపిస్తున్నా... ఇలాంటి వ్యాఖ్య‌లు మ‌రోమారు రిపీట్ చేయ‌కుంటే చాలంటూ స‌ర్దిచెప్పిన తీరు చూస్తుంటే... ఈ వార్నింగ్ స్వీట్ వార్నింగ్ గానే ప‌రిగ‌ణించాల‌న్న వాద‌న వినిపిస్తోంది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా తెలంగాణ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల విజ‌యం కోసం త‌న‌దైన శైలి ప్ర‌చారం చేసిన కేసీఆర్.. మొత్తం 17 సీట్ల‌లో హైద‌రాబాద్ సీటు మిన‌హా అన్నిచోట్లా త‌న పార్టీ అభ్య‌ర్థుల‌నే గెలిపించాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

అయితే ఎన్నిక‌ల సంఘం కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన ఘ‌ట‌న‌పై వివ‌రాల్లోకి వెళితే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ తొలి స‌భ‌లోనే బీజేపీని ఉద్దేశించి 'హిందుగాళ్లు బొందుగాళ్లు‘ అని కామెంట్ చేశారు. బీజేపీ నేతలు గుళ్లు, గోపురాలు తిరుగుతరా ? మిగతావారు ఆలయాలకు వెళ్లారా అని ప్రశ్నించారు. మేం తిరుపతి, ఎములాడ వెళ్లమా ... వాళ్లేనా హిందుగాళ్లు బొందుగాళ్లు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఆరెస్సెస్ కు చెందిన ఓ నేత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ ను ఈసీ వివరణ కోరింది. దీంతో కేసీఆర్ కూడా లిఖితపూర్వకంగా ఎక్స్ ప్లనేషన్ ఇచ్చారు.

అయితే కేసీఆర్‌ వివరణతో సంతృప్తి చెందని ఈసీ .. కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చింది. బొందుగాళ్లు వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేన‌ని అభిప్రాయ‌ప‌డ్డ ఈసీ .. మరోసారి రిపీట్ కానియొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. మొదటిసారి కాబట్టి హెచ్చరించి వదిలేస్తున్నామని వెల్లడించింది. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి ఘటన రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. మొత్తంగా బీజేపీ నేత‌ల‌పై కేసీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్య‌ల‌కు ఈసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసి వ‌దిలేసింద‌న్న వాద‌న ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోంది.