Begin typing your search above and press return to search.
జమ్మూకశ్మీర్ పర్యటకంపై కేంద్రం ఫోకస్
By: Tupaki Desk | 21 Feb 2021 9:30 AM GMTజమ్మూ కశ్మీర్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. హిమాలయాలకు నెలవైన ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదం ఉక్కు పిడికిలి నుంచి తప్పించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నడుం బిగింది. ఈ క్రమంలోనే పటిష్ట చర్యల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీనగర్ కు విమానాలు రావాలంటూ జమ్మూ కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ కేంద్రాన్ని కోరారు. జమ్మూకశ్మీర్ టూరిజంకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని.. దీని ద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని నరేంద్రమోడీకి తెలిపారు.
జమ్ముకాశ్మీర్‌కు అభివృద్ది చెందాకే ఇంకాస్త చేయూతగా రెగ్యులర్ కమర్షియల్ ఇంటర్నేషనల్ విమానాలను అక్కడ ఏర్పాటు చేయాలని, దాని ద్వారా రాష్ట్రంలో అభివృద్ది, ఎగుమతి, దిగుమతులు వంటి పెరుగుతాయని చెప్పారు. అంతేకాకుండా జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం తమ ఎగుమతులను రూ.1400 కోట్ల నుంచి రూ.5వేల కోట్లకు రానున్న రెండు సంవత్సరాల్లో పెంచేందుకు కృషి చేస్తుందని అన్నారు. దీంతో పాటుగా 2021 బడ్జెట్‌లో కాశ్మీర్‌కు కొత్త గ్యాస్ పైప్ లైన్‌ను ప్రకటించినందుకు మనోజ్ సిన్మా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల జరిగిని నీతిఅయోగ్ 6వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో లిఫ్టనెంట్ గవర్నర్ జమ్ము కాశ్మీర్ గురించి మాట్లాడారు. 17నెలల క్రితం స్వాధీనం చేసుకున్న ప్రాంతం గురించి అనేక విషయాలను తెలిపారు. ‘ 2019 ఆగస్ట్ 5న స్వాధీనం చేసుకున్న తర్వాత జమ్ము కాశ్మీర్ ఎన్నో సరికొత్త అవకాశాలను పొందింది. అభివృద్దికి నాంది పలకింది. ఎన్నో దశాబ్దాల తరువాత ఇక్కడి ప్రజలు ప్రగతి పథంలో ముందుకు వెళుతున్నాయి. ఇన్నేళ్ల తరువాత జమ్ము కాశ్మీర్ అభివృద్ది, శాంతి, భద్రత వంటి వాటి మధ్య మెలుగుతుంద’ని మనోజ్ అన్నారు.