Begin typing your search above and press return to search.

లాక్డౌన్ ఫెయిల్.. జగన్ మోడల్ తెరపైకి?

By:  Tupaki Desk   |   4 May 2020 11:30 AM GMT
లాక్డౌన్ ఫెయిల్.. జగన్ మోడల్ తెరపైకి?
X
ప్రధాని నరేంద్రమోడీ నెలన్నర కిందటే కరోనా మహమ్మారి తీవ్రతను ఊహించి దేశంలో లాక్ డౌన్ విధించారు. అయితే మార్చి 24 నుంచి మొదలైన్ లాక్ డౌన్ ప్రస్తుతం మూడో దశకు పొడిగించబడింది. అయినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. లక్షల సంఖ్యలో పరీక్షలు చేస్తున్నా కేసులు పెరుగుతున్నాయే కానీ వ్యాప్తి తగ్గడం లేదు.

దీంతో ఈ వైరస్ ను మానవ జీవితంలో భాగంగా మార్చుకొని పోరాటం సాగించాలన్న ఏపీ సీఎం జగన్ మోడలే ఇప్పుడు దేశానికి దిక్కు అవుతుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లాక్ డౌన్ దేశంలో విఫలం కావడానికి మన జనాభా కారణం.. దేశంలో భారీ జనసాంద్రత ఉండడం.. వారంతా వివిధ రోజువారీ కార్యకలాపాల కోసం బయటకు వస్తుండడమే వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది. దేశంలో ప్రస్తుతం 42533 కేసులు, 1373మరణాలు సంభవించాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 83 మంది మృతులతో కొత్త రికార్డు నమోదైంది. దీంతో లాక్ డౌన్ ఫలితంపై సందేహాలు వ్య్తక్తమవుతున్నాయి.

లాక్ డౌన్ తో జనం ఇళ్లలో ఉంటున్నా కూడా కరోనా వ్యాప్తి ఆగడం లేదు. దీంతో గత నెలలో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీఎం జగన్ లాక్ డౌన్ పరిమితులు సడలిస్తూ పోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థతోపాటు మిగతా రంగాలను గాడిన పెట్టడమే మంచిదని సలహా ఇచ్చారు. జనాన్ని ఎక్కువ రోజులు కట్టిపడేయడం సాధ్యం కాదని ప్రధాని మోడీకి గుర్తు చేశారు. కరోనా వైరస్ తో ప్రజలు సహజీవనం చేయాలని.. అదొక మాములు వ్యాధిగా పరిగణించి ముందుకెళ్లాలని సూచించారు.

అందుకే తాజాగా ఈరోజు మే 4 నుంచి ఏపీలో లాక్ డౌన్ మినహాయింపులు మొదలయ్యాయి. మద్యం అమ్మకాలు షూరూ చేశారు. లాక్ డౌన్ సడలింపులతో రాష్ట్ర సచివాలయంతోపాటు ఇతర కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివిధ రంగాల పనులకు పచ్చ జెండా ఊపారు. ఈ సడలింపులు పెంచాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. జగన్ మోడల్ ను ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, దేశం అవలంభిస్తే జనాల బాధలు తప్పుతాయని పలువురు పేర్కొంటున్నారు.