Begin typing your search above and press return to search.
జగన్‌కు కేంద్రం తెచ్చిన మరో సంకటం.. కిం కర్తవ్యం..!
By: Tupaki Desk | 31 July 2021 11:38 AM GMTఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం పదే పదే ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తూ వస్తోంది. కేంద్రం వైఖరి చూస్తుంటే ఏపీ అభివృద్ధి చెందేందుకు ఎంత మాత్రం ఇష్టంలేనట్టుగానే ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి మూడేళ్లు ముందుకు సాగిన కేంద్రం ఆ తర్వాత టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లేలా పొగ పెట్టింది. ఇక ఇప్పుడు జగన్‌ను కూడా టార్గెట్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న జగన్ ప్రభుత్వానికి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. పట్టు వీడేది లేదు.. ఎంతవరకైనా వెళ్తానంటూ.. జగన్ ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో.. ఇంగ్లీష్ మీడియం బోధనకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిపై విపక్షాల నుంచి ప్రధాన పత్రికల ప్రతినిదుల నుంచి కూడా జగన్ ప్రభుత్వంపై మాటల యుద్ధం కొనసాగినా.. ఆయన వెనక్కి తగ్గలేదు. పైగా `మీ పిల్లలు ఎక్కడ చదివారు.. ఇప్పుడు మీ మనవళ్లు ఎక్కడ చదువుతున్నారు` అని ఎదురు దాడి చేశారు. ఇక, జగన్ ఇంగ్లీష్ మీడియంపై కోర్టుల్లో కేసులు కూడా పడ్డాయి.
అయినప్పటికీ.. జగన్ దూకుడుగానే వ్యవహరించారు. పాఠ్యాంశాలను ఇప్పటికే ఇంగ్లీష్‌లో ముద్రించారు. త్వరలోనే ప్రారంభం కానున్న పాఠశాలల్లో ఆంగ్ల మీడియాన్ని ప్రవేశ పెట్టి అమలు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఇంటర్ వరకు కూడా ఇంగ్లీష్ మీడియం పూర్తిగా అమలు చేయాలని చూస్తున్నారు. అయితే.. రాష్ట్రంలో దీనిపై వ్యతిరేకతను పక్కన పెడితే.. ఇప్పుడు కేంద్రం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ.. మాతృభాషలోనే విద్యా బోధన సాగేలా చూడాలని ఆదేశించింది. అంతేకాదు.. టెక్నికల్ కోర్సులైన ఇంజనీరింగ్ విద్యను కూడా మాతృభాషలోనే బోధించాలని.. సూచించారు. దీనికి సంబంధించి కేంద్రం గత ఏడాది కాలంగా కృషి చేస్తోందని.. ప్రధాని వివరించారు.
జాతీయ విద్యా విధానంలో భాగంగా.. ప్రాథమికంగా ఐదు భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న ప్రధాని.. వీటిలో తెలుగు కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు జగన్‌కు పెద్ద సంకటమే వచ్చింది. తన నిర్ణయాన్ని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు విమర్శిస్తే.. ఎదురు దాడి చేశారు.. సరే.. ఇప్పుడుకేంద్రం వద్ద ఎలా నచ్చజెపుతారు? అనేది కీలకంగా మారింది. మరోవైపు.. ఎట్టి పరిస్థితిలోనూ మాతృభాషలోనే బోధన చేయాలని మోడీ నిర్దేశించిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత.. జగన్ ఎలా ముందుకు వెళ్తారు.. అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికిప్పుడు దీనిపై వెనక్కి తగ్గితే.. రాజకీయంగా విమర్శలు తప్పవు. పోనీ.. ముందుకు వెళ్తామంటే.. మోడీని ధిక్కరించినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయంపై వైసీపీ అధినేత తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.