Begin typing your search above and press return to search.

ఇదేం జీఎస్టీ.. ప్ర‌జ‌ల‌ను వాయించేస్తోందిగా!

By:  Tupaki Desk   |   30 Aug 2022 7:49 AM GMT
ఇదేం జీఎస్టీ.. ప్ర‌జ‌ల‌ను వాయించేస్తోందిగా!
X
కేంద్ర ప్ర‌భుత్వం వ్యాట్ స్థానంలో తెచ్చిన జీఎస్టీ (గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్) ప్ర‌జ‌ల‌కు చుక్కలు చూపిస్తోంది. జీఎస్టీపై దేశవ్యాప్తంగా అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌యిన‌ప్పుడు ఇది ప్ర‌జ‌లు, వ్యాపారులు, ప్ర‌భుత్వాలు.. ఇలా అంద‌రి మంచి కోసం ఒకే ఒక ఏకీకృత విధానాన్ని ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని తెలిపింది. కానీ అప్ప‌ట్లో నిర‌స‌న‌కారులు వ్య‌క్తం చేసిన భ‌యాలే ఇప్పుడు కేంద్రం చేపడుతున్న చ‌ర్య‌ల‌తో నెల‌కొంటున్నాయి.

భారతీయ రైల్వేల‌ ద్వారా ప్రజలు ఏడాది పొడవునా ప్రయాణిస్తారు. సెలవులు లేదా పండుగల సీజన్‌లో రైలు టిక్కెట్‌ల డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో ప్రయాణికులు సీటు కోసం ముందుగానే టిక్కెట్లు కొనుగోలు చేస్తారు. అయినప్పటికీ, చివరి నిమిషంలో అత్యవసర పరిస్థితి లేదా ప్లాన్‌లలో మార్పు కారణంగా చాలా మంది ప్రజలు తమ టిక్కెట్‌లను రద్దు చేసుకుంటూ ఉంటారు. అలాంటి స‌మ‌యంలో మ‌న‌కు కొంత మొత్తం వెనక్కి తిరిగి వ‌స్తుంద‌నేది తెలిసిన విష‌య‌మే, అయితే ఇక నుంచి రైల్వే టికెట్ల మీద జీఎస్టీ కూడా విధిస్తుండ‌టంతో ఆ మొత్తాన్ని మ‌నం టికెట్ ర‌ద్దు చేసుకుంటే వెన‌క్కి తిరిగి ఇవ్వ‌రు.

ఈ మేర‌కు ఆగ‌స్టు 3న కేంద్ర రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం.. ఫస్ట్-క్లాస్ లేదా ఏసీ కోచ్ టిక్కెట్ రద్దు రుసుము 5% జీఎస్టీకి లోబడి ఉంటుంది. ఇది టిక్కెట్‌పై అంచనా వేసిన రేటు. మీరు రైలు టికెట్ బుక్ చేసుకుని.. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా దాన్ని ర‌ద్దు చేసుకుంటే జీఎస్టీ మొత్తాన్ని తిరిగి ఇవ్వ‌రు. మీరు మీ హోటల్ లేదా ఫ్లైట్ రిజర్వేషన్‌లను రద్దు చేయవలసి వచ్చినా ఇదే జీఎస్టీ వ‌ర్తిస్తుంద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో రైలు టికెట్లు, హోట‌ళ్లు, విమాన టికెట్లు బుక్ చేసుకుని.. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ర‌ద్దు చేసుకుంటే కొంత రుసుమును త‌గ్గించుకుని మిగ‌తా మొత్తాల‌ను అవి మ‌న‌కు ఇస్తాయి. అయితే జీఎస్టీ కింద ఆ టికెట్ల‌తోపాటు వ‌సూలు చేసిన మొత్తాన్ని మాత్రం తిరిగి ఇవ్వ‌వు. ఇదే విష‌యాన్ని కేంద్రం విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ తెలుపుతోంది.

గ‌తంలో రైలు టికెట్ బుక్ చేసుకుని ర‌ద్దు చేసుకుంటే ప్ర‌యాణానికి 48 గంట‌ల స‌మ‌యం ఉంటే 20 రూపాయ‌లు మాత్ర‌మే త‌గ్గించుకుని మిగ‌తా మొత్తాన్ని రైల్వే వెన‌క్కి ఇచ్చేది. ఆ త‌ర్వాత ఇలాంటివాళ్ల‌ను త‌గ్గించే ఉద్దేశ‌మ‌ని చెబుతూ రైలు టికెట్ ను బుక్ చేసుకుని క్యాన్సిల్ చేస్తే భారీగా 80 నుంచి 120 రూపాయ‌ల వ‌ర‌కు (స్లీప‌ర్ క్లాస్) త‌గ్గించుకుని రైల్వే ఇస్తోంది. ఇప్పుడు దీనికి జీఎస్టీ అద‌నం అన్న‌మాట‌. మీరు క‌నుక రైలు టికెట్ బుక్ చేసుకుని.. ప్ర‌యాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటే మీకు ట్రైన్ టికెట్ మొత్తం చార్జీలో స‌గం కూడా రాన‌ట్టే. ఇక జీఎస్టీ కింద చెల్లించినదానిపై అయితే పూర్తిగా ఆశ‌లు వదులుకోవాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.