Begin typing your search above and press return to search.

20 ల‌క్ష‌ల‌ కోట్లు ఎగ్గొట్టారు.. ఏం చేస్తాం?!: చేతులెత్తేసిన కేంద్రం

By:  Tupaki Desk   |   21 Dec 2022 8:43 AM GMT
20 ల‌క్ష‌ల‌ కోట్లు ఎగ్గొట్టారు.. ఏం చేస్తాం?!: చేతులెత్తేసిన కేంద్రం
X
ఎవ‌రైనా 100 రూపాయ‌లు మీ ద‌గ్గ‌ర అప్పుగా తీసుకున్నార‌నుకోండి.. మీరు ఏం చేస్తారు? వారి పేరును గుర్తు పెట్టుకుంటారు. చెప్పిన టైంకి ఇవ్వ‌క‌పోతే.. ఇంటికివెళ్లి మ‌రీ గుంజుకుంటారు. కానీ, వేల కోట్ల రూపా య‌లు తీసుకుని దేశం విడిచిపారిపోయిన‌.. దేశంలోనే ఉండి కూడా.. క‌ట్ట‌కుండా ఎగ్గొడుతున్న వారి వివ రాలు.. మాత్రం తమ వ‌ద్ద‌లేవ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ఈ దేశ ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా పబ్లిక్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు 19.94 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది. ఆయా బకాయిల వివరాలను కూడా బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లు ను౦చి కొట్టేశాయని వివరించింది. మొండి బకాయిల రద్దు అనేది ఆర్బీఐ నిబంధనలు, విధానాల మేరకే జరిగినట్టు కేంద్రం చెప్ప‌డం విశేషం.

ఆర్బీఐ నిబంధనల మేరకు పబ్లిక్ సెక్టార్, కమర్షియల్ బ్యాంకులు గత ఆరేళ్లలో వరుసగా రూ.8,16,421 కోట్లు, రూ.11,17,883 కోట్ల మొండి పద్దులను (మొత్తం రూ.19,34,304 కోట్లు) రద్దు చేశాయి అని కేంద్ర‌మంత్రి వివరించారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. రూ.కోటికి పైగా మొత్తాలను ఎగవేసిన వారి వివరాలు సహా మొండి పదుల వివరాలు ఖాతాల వారీగా మెయింటెన్ చేయడం లేదని, వారి వివరాలు తెలియవని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఇక, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు రూ.25 లక్షలకు పైగా మొత్తాలను ఉద్దేశ పూర్వకంగా ఎగ్గొట్టిన వారి జాబితా ప్రకారం 2017, జూన్ 30 నాటికి 8,045 మంది ఉన్నారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి 12,439 మంది ఉన్నారని వివరించారు.

అదేసమయంలో ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల్లో 2017, జూన్ 30 నాటికి 1,616 మంది, ఈ ఏడాది జూన్ 30 నాటికి 2,447 మంది ఉన్నారన్నారు. రూ.25 లక్షలకు మించి రూ.కోటి లోపు ఎగవేసిన వారి వివరాలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.