Begin typing your search above and press return to search.

కరోనా విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   11 Sept 2020 1:20 PM IST
కరోనా విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
X
130 కోట్ల భారత దేశంలో అంటువ్యాధి అయిన కరోనాను నియంత్రించడం అంత తేలికైన విషయం కాదు.. అందుకే రోజుకు 70వేల పైన కేసులు దేశంలో నమోదవుతున్నాయి. చాలా మందికి కరోనా వచ్చి తగ్గిపోయింది. కొందరికి వైరస్ సోకినా లక్షణాలు బయటపడడం లేదు.

కరోనా లక్షణాలున్నా నెగెటివ్ గా వస్తుండడంపై కేంద్రం కీలక సూచనలు చేసింది. ర్యాపిడ్ టెస్టుల్లో నెగెటివ్ అని తేలిన వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. పాజిటివ్ కేసులు గుర్తించకపోతే.. వారి ద్వారా ఇతరులకు వైరస్ సోకుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలో నమోదవుతున్న కొత్త కరోనా కేసుల్లో 60శాతం కేవలం ఐదురాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్రం తెలిపింది. టెస్టులు ఎక్కువగా చేయాలని.. కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో టెస్టులను పెంచాలని కేంద్రం మహారాష్ట్ర, ఏపీ సహా పలు రాష్ట్రాలకు సూచించింది.

మాస్కులు ఎక్కువగా వాడడం వల్లే కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో 69శాతం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఆంద్రప్రదేశ్ లోనే నమోదవుతున్నాయని వివరించింది.