Begin typing your search above and press return to search.

కేంద్రం షాకింగ్ డెసిషన్..31వరకు డొమెస్టిక్ ఫ్లైట్స్ రద్దు

By:  Tupaki Desk   |   23 March 2020 1:21 PM GMT
కేంద్రం షాకింగ్ డెసిషన్..31వరకు డొమెస్టిక్ ఫ్లైట్స్ రద్దు
X
ప్రాణాంతక వైరస్ గా పరిణమించిన కరోనాను కట్టడి చేసేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు కఠినాతికఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఇప్పటికే చాలా దేశాలు షట్ డౌన్ దిశగా చర్యలు చేపట్టగా... అదే దిశగా అడుగులు వేస్తున్న భారత ప్రభుత్వం... ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని కూడా నరేంద్ర మోదీ సర్కారు సోమవారం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశీయ విమాన సర్వీసులను కూడా నిలుపుదల అయిపోతున్నాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం పౌర విమానయాన శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం అమలులోకి వస్తే... దేశ గగన తలంపై ఇకపై ఒక్కటంటే ఒక్క విమానం కూడా కనిపించదని చెప్పాలి. ఎందుకంటే.. కోవిడ్- 19ను కట్టడి చేసేందుకు ఇప్పటికే అంతర్జాతీయ విమాన సేవలను కేంద్రం రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది కదా. తాజాగా ఇప్పుడు దేశీయ విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తే... గగనతలంలో విమానాలే కనిపించవు. దేశీయ విమాన సర్వీసుల రద్దును ప్రస్తుతానికి ఈ నె 31 వరకు నిషేధిస్తున్నట్లు పేర్కొన్న కేంద్రం.. .తదుపరి పరిస్థితిని బట్టి ఈ ఉత్తర్వులను పొడిగించాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది.

ఇదిలా ఉంటే.. కరోనా నేపథ్యంలో కారణంగా ఇప్పటికే 19 రాష్ట్రాలు - అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్‌ ను ప్రకటించాయి. అటు ఆరు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు షట్ డౌన్ అయ్యాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం కూడా లాక్ డౌన్ ప్రకటించింది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 31 వరకు అత్యవసర సేవలు మినహాయించి.. అన్నీ సర్వీసులు బంద్ కానున్నాయని ఆ రాష్ట్ర సీఎం పళణి స్వామి వెల్లడించారు. అటు ఆర్టీసీ బస్సులు - ప్రైవేటు వాహనాలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఎవరైనా దిక్కరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.