Begin typing your search above and press return to search.
'పసుపు' మంటలు.. అంటుకుంటున్నట్టే?
By: Tupaki Desk | 17 March 2021 2:30 AM GMTతెలంగాణలోని నిజామాబాద్ కేంద్రంగా 'పసుపు బోర్డు' ఏర్పాటు అన్నది అక్కడి రైతులు చేస్తున్న అతి పెద్ద డిమాండ్. ప్రతి సార్వత్రిక ఎన్నికల వేళ దీని చుట్టే రాజకీయం సాగుతోంది. పోయిన సారి 'పసుపు బోర్డు దెబ్బకు' ఏకంగా కేసీఆర్ కూతురు కవిత కూడా ఓడిపోయింది. ఇదే పసుపు బోర్డు తెస్తానని.. బీజేపీ ఎంపీ అరవింద్ బాండ్ రాసిచ్చి మరీ రైతులను ఒప్పించి గెలిచాడు.
అయితే ఆయన గద్దెనెక్కి రెండేళ్లయినా పసుపు బోర్డు తేక పోవడంతో అరవింద్ కు రైతుల సెగ తగులుతోంది. ఈక్రమంలోనే పార్లమెంట్ సాక్షిగా పసుపుబోర్డు నిజామాబాద్ కు సాధ్యం కాదని కేంద్రం తేల్చేసింది. నిజామాబాద్ లో పసుపు బోర్డు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా మంగళవారం లోక్ సభలో స్పష్టం చేశాడు. పసుపు బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు లోక్ సభలో చాలా గట్టిగానే కేంద్రాన్ని నిలదీశాడు. పసుపు బోర్డు ఏర్పాటుతో వంగడాలపై పరిశోధనలు జరుగుతాయని.. పసుపు మార్కెటింగ్ మెరుగుపడుతుందని.. ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో సగం నిజామాబాద్ లో తయారవుతోందని.. పసుపు కోసం ప్రత్యేకంగా బోర్డు పెడితే ఎన్నో లాభాలున్నాయని వివరించారు.
అయితే నిజామాబాద్ లో ఏర్పాటైన సుగంధ ద్రవ్యాల బోర్డు పనిచేస్తోందని.. ఇక పసుపు బోర్డు అవసరం లేదని కేంద్రమంత్రి కుండబద్దలు కొట్టారు. పసుపు బోర్డు చేసే అన్ని పనులు, అన్ని లాభాలు సుగంధ ద్రవ్యాల బోర్డుతో కలుగుతాయని స్పష్టం చేశారు. మళ్లీ పసుపుబోర్డు అవసరం లేదని తేల్చిచెప్పారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి రాజ్యసభలోనూ స్పష్టం చేశారు.
ఇక తెలంగాణలో పసుపు బోర్డు కంటే మెరుగైన సుగంధ ద్రవ్యాల ఎక్స్ టెన్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ మాటలు నిజామాబాద్ రైతుల కడుపునింపేలా కనిపించడం లేదు. వారు మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏ పసుపు బోర్డు అయితే బీజేపీని నిజామాబాద్ లో గెలిపించిందో అదే ఇప్పుడు అక్కడ బీజేపీ ఎంపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది.