Begin typing your search above and press return to search.

ఏంది మోడీ.. ఈ ప‌ని.. దేశం ప‌రువు తీస్తున్నారుగా!

By:  Tupaki Desk   |   29 Aug 2021 3:30 AM GMT
ఏంది మోడీ.. ఈ ప‌ని.. దేశం ప‌రువు తీస్తున్నారుగా!
X
కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యం.. తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న నిర్ణ‌యం.. దేశం ప‌రువును ప్ర‌పంచ దేశాల ముందు తీసిన‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు. అంతేకాదు.. ప్ర‌పంచంలోనే అతి పెద్ద దేశాల్లో ప్ర‌థ‌మ వ‌రుస‌లో ఉన్న భార‌త్ ఇంత బ‌ల‌హీనంగా ఉందా? అనే సందేహాలు వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ.. నిప్పులు చెరుగుతున్నారు. అయితే.. దీనిపై ప్ర‌ధాని మోడీ కానీ, ప్ర‌భుత్వ నేత‌లు కానీ.. ఏ ఒక్క‌రూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఏం జ‌రిగింది? దేశం ప‌రువు దిగజారి పోతోందా? అంటే.. ఔనంటున్నారు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.

విష‌యంలోకి వెళ్తే.. 137 కోట్ల మంది ప్ర‌జ‌ల‌తో నిండిన భార‌త్‌కు త్రివిధ ద‌ళాలు ఉన్నాయి. శ‌తృదేశాల‌కు స‌మ‌యానికి అనుకూలంగా బుద్ధి చెప్ప‌గ‌ల సైన్యం, ఆయుధాలు మ‌న సొంతం అంటూ.. ఏటా వాటిని రిప‌బ్లిక్ డే రోజు ప్ర‌ద‌ర్శిస్తారు కూడా. దీంతో నిజంగానే మ‌న దేశం `శ‌క్తి సంప‌న్న‌`మ‌నే అంద‌రూ అనుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా మోడీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం.. ఈ అంచ‌నాల‌ను త‌ల‌కింద‌లు చేస్తోంది.

ఆఫ్ఘానిస్థాన్లో అమెరికా విడిచిపెట్టి వెళ్లిన ఆయుధ సామగ్రి తాలిబన్ల చేతికి చిక్కింది. అత్యాధునిక ఆయుధాలతో తాలిబన్లు ఏం చేస్తారోనని ఆందోళన నెలకొంది. అదే సమయంలో తాలిబన్ల నుంచి ఇతర ఉగ్రసంస్థలకు ఆ ఆయుధాలు చేతులు మారే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో భారత వాయుసేన(ఐఏఎఫ్).. దేశ ఆయుధ సంపత్తిని పెంపొందించుకునే చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. రష్యా నుంచి 70 వేల ఏకే-103 రైఫిళ్లను అత్యవసరంగా కొనుగోలు చేసింది. దీనికి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

వాస్త‌వానికి మ‌న దేశంలో ఆయుధ సంప‌త్తి భారీగా ఉంద‌ని. ఏ దేశానికైనా బుద్ధి చెబుతామ‌ని ప్ర‌క‌టించిన కేంద్ర పెద్ద‌లు ఇంత పెద్ద‌మొత్తంలో ఆయుధాల‌ను కొనుగోలు చేయ‌డం అంటే.. `ముందు చూపు` లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏకంగా ఇప్ప‌టికిప్పుడు.. 70 వేల ఏకే-103 రైఫిళ్ల అత్యవసర కొనుగోలుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. తాలిబన్ల వశమైన అమెరికా ఆయుధాలు.. క్రమంగా ఇతర ఉగ్రసంస్థల చేతికి చిక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టిన‌ట్టు అధికారులు తెలిపారు.

కొత్తగా కొనుగోలు చేసిన రైఫిళ్లు కొన్ని నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ఉగ్రదాడులను నియంత్రించేందుకు భద్రతా బలగాలు మరింత శక్తిమంతమవుతాయ‌ని అంటున్నారు. "70వేల ఏకే-102 రైఫిళ్లను రష్యా నుంచి గత వారం అత్యవసరంగా కొనుగోలు చేశాము. ఈ కాంట్రాక్టు విలువ రూ. 300కోట్లు. జమ్ముకశ్మీర్, శ్రీనగర్ వంటి సున్నిత ప్రాంతాల్లో, వాయుసేన స్థావరాల వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి తొలుత అందిస్తాము`` అని అధికారి ఒక‌రు తెలిపారు.

ఈ ఏకే-103.. విధ్వంసకర ఏకే-47కు అప్గ్రేడెడ్ వెర్షన్. ఈ ఏకే-103ని భారత నేవీ ఇప్పటికే వినియోగిస్తోంది. కశ్మీర్ లోయలోని వూలర్ లేక్ వద్ద గస్తీ కాస్తున్న సిబ్బంది వద్ద ఈ తుపాకులు ఉన్నాయి. అయితే.. ఇంత‌క‌న్నా ఆధునిక ఆయుధాలు మ‌న‌దగ్గ‌ర ఉన్నాయ‌ని .. ఇటీవ‌ల ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ప‌ష్టం చేశారు. కానీ, ఇప్పుడేమో.. ర‌ష్యా నుంచి కొంటున్నారు. మ‌రి ఈ చిత్రం ఏంటో కేంద్రానికే తెలియాల‌ని అంటున్నారు విశ్లేష‌కులు. విప‌క్ష నేత‌లు మాత్రం భార‌త్ ను అభ‌ద్ర‌తాభావంలోకి నెట్టేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.