Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ !
By: Tupaki Desk | 19 March 2020 12:10 PM GMTకరోనా భయం ప్రపంచ వ్యాప్తంగా అందరిలోనూ నెలకొంది. భారతదేశంలో కరానా చాపకింద నీరులా విస్తరిస్తోంది. చాలామందిలో ఈ వైరస్ లక్షణాలు బయట పడుతున్నాయి. వ్యాపార - వర్తక సంస్థలు - ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఆఫీసుకు వచ్చే బదులు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేయాలని సంస్థలు సూచిస్తున్నారు. ఇప్పటికే ఐటీ రంగంలో దీన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. ఇతర రంగాలకు చెందిన వారు కూడా దీనిపై దృష్టి సారిస్తున్నాయి. ఈ వైరస్ తుమ్మడం - దగ్గడం నుంచి సోకుతుందని వైద్యులు చెబుతుండడంతో సంస్థలు ఉద్యోగుల విషయాల్లో పలు చర్యలు చేపట్టాయి. ఆఫీసుల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు.
అలాగే ఇప్పటికే కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కఠిన చర్యలు అమలు చేస్తుంది. అయితే , కరోనా మరింత వేగంగా విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ లో సగం మందిని ఇంటి నుంచే విధులు నిర్వర్తించమని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మిగిలినవారు కార్యాలయాలకు హాజరుకావాలని తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు కరోనా కారణంగా నలుగురు మృతి చెందారు.
కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం..గ్రూప్ బి - గ్రూప్ సి ఉద్యోగులలో 50 శాతం మంది ప్రతిరోజూ కార్యాలయానికి హాజరు కావాలి. మిగిలిన 50 శాతం సిబ్బంది ఇంటి నుండి పని చేయమని ఆదేశాలు ఉన్నాయి. ఉద్యోగుల పని గంటలను మార్చాలని కేంద్ర సిబ్బంది - ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ గురువారం తెలియజేసింది. రూపొందించిన జాబితా ప్రకారం ఒక నిర్దిష్ట రోజు ఇంటి నుండి పని చేయబోయే కేంద్ర ప్రభుత్వ అధికారులు - టెలిఫోన్ - ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల ద్వారా అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.