Begin typing your search above and press return to search.

లక్ష కోట్లతో కేంద్రం కొత్త బ్యాంక్?

By:  Tupaki Desk   |   26 Jan 2021 2:30 AM GMT
లక్ష కోట్లతో కేంద్రం కొత్త బ్యాంక్?
X
ప్రతి సారి కేంద్రం పథకాలు అమలు ప్రవేశపెట్టడం..మౌళిక వసతుల ప్రాజెక్టులు చేపట్టడం.. నగదు బదిలీచేయడం.. వాటిని అమలు చేయాలని బ్యాంకులను కోరడం.. అవి మొండి బకాయిల పేరుతో వాయిదా వేయడంతో ప్రభుత్వాలకు పథకాల నిర్వహణ పెనుభారంగా మారింది. అందుకే ఈ ఇబ్బందులు తొలిగేలా ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఒక బ్యాంకు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వచ్చే బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ప్రకటన చేస్తారని అంటున్నారు. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు దేశంలోనే అతి తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా ఈ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ప్రావిడెంట్ ఫండ్ - పెన్షన్ - ఇన్సూరెన్స్ ఫండ్స్ కొంత మొత్తాన్ని ఖచ్చితంగా ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలన్న షరతులను కూడా విధించి మూలధనాన్ని పెంచేందుకు కేంద్రం ఆలోచిస్తోందట..

లక్ష కోట్లతో ఈ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తారని.. మొదట 20వేల కోట్లతో కార్యకలాపాలు ప్రారంభిస్తారని జాతీయ మీడియా అంటోంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందించాని.. ఈ బ్యాంక్ పై సర్వాధికారాలు ఆర్థిక శాఖకు ఉంటాయని చెబుతున్నారు. బడ్జెట్ లో నే దీనిపై క్లారిటీ రానుంది.