Begin typing your search above and press return to search.
పాన్ ను ఆధార్ తో లింక్ చేయలేదా? నో టెన్షన్!
By: Tupaki Desk | 1 April 2019 6:34 AM GMTఏదైనా కీలక అంశానికి సంబంధించి గడువు దగ్గర పడుతుందంటే ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఇంత పెద్ద దేశంలో.. కొన్ని విషయాల్ని పూర్తి చేయటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ చేద్దామని ప్రజల్లో ఉన్నా.. చేసే పరిస్థితులు.. వాతావరణం.. మౌలిక సదుపాయాలు సరిగా ఉండవు.
పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే అంశానికి సంబంధించి ఇప్పటికే పలు గుడువుల్ని ఇచ్చారు. అయితే.. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావటానికి ఉన్న ఇబ్బందులు ఎన్నో. ఈ విషయాన్ని గుర్తిస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయంతో అనవసరమైన గాబరా తప్పుతోంది.
తాజాగా అలాంటి నిర్ణయమే మరొకటి తీసుకున్నారు. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవటానికి ఉన్న గడువును మరో ఆర్నెల్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత జూన్ లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాన్ తో ఆధార్ అనుసంధానం ఈ ఏడాది మార్చి 31 వరకు గడువుగా నిర్ణయించారు. నిన్నటితో ఆ గడువు ముగిసింది. అయితే.. లింక్ చేసే ప్రక్రియ పూర్తి కావటంతో.. తాజాగా మరో ఆర్నెల్లు అనుసంధానం చేసుకోవటానికి గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో ఇప్పటివరకూ లింక్ చేసుకోవటానికి గడువు పొడిగించటం ఆరోసారి కావటం గమనార్హం.