Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : లాక్ డౌన్ మరో 2 వారాలు పొడగింపు..మరికాసేపట్లో కేంద్రం ప్రకటన !
By: Tupaki Desk | 11 April 2020 10:24 AM GMTకరోనా వైరస్ .. ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతుంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ వ్యాప్తి చెందుతూ ... ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలకి వ్యాప్తి చెందింది. తొలుత చైనా ఈ వైరస్ పై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఈ వైరస్ అన్ని దేశాలకి పాకిపోయింది. ఆ తరువాత చైనా ఈ వైరస్ పై విజయం సాధించినప్పటికీ కూడా మిగిలిన దేశాలు కరోనా దాటికి అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికా - ఇటలీ - స్పెయిన్ లాంటి దేశాలలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంది. అమెరికాలో ఈ మహమ్మారిని నియంత్రించడానికి పలు చర్యలు తీసుకుంటున్నా మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. బాధితుల సంఖ్య ఐదు లక్షలు దాటిపోయింది అయిన కూడా కరోనా ఇంకా కంట్రోల్ లోకి రాలేదు.
కాగా, ఇతర దేశాలతో పోలిస్తే - భారత్ లో కరోనా ఉదృతి తక్కువే అని చెప్పవచ్చు. భారత్ ముందు చూపు ధోరణితో వ్యవహరించి లాక్ డౌన్ ను అమలు చేయడంతో భారత్ లో కరోనా భాదితులు తక్కువ ఉన్నారు. అయితే , రోజురోజుకి కరోనా కేసులు అయితే వెలుగులోకి వస్తున్నాయి. దీనితో దేశంలో కరోనాను అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ గడువు ఏప్రిల్ 14 తో ముగియబోతుంది. కానీ , ఇంకా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. దీనితో ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడగించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా ఈ విదంగా ఉంది , అలాగే కట్టడికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని అని - అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మెజార్టీ సీఎంలు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధానిని కోరారు. కేజ్రీవాల్ - అమరీందర్ సింగ్ - నవీన్ పట్నాయక్ - యడుయూరప్ప - కేసీఆర్ తదితరులు పొడిగించాలని కోరినట్టు తెలుస్తోంది. అలాగే దీనిపై గత రెండు మూడు రోజులుగా కేంద్ర మంత్రులు కూడా పలువురు అధికారులతో సమీక్షలు జరిపారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎం ల అభిప్రాయాలని తీసుకోని - దేశంలో కరోనా కట్టడికోసమే మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే లాక్ డౌన్ కు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ పొడగింపు పై కేంద్రం సాయంత్రంలోపు అధికారిక ప్రకటన విడుదల చేయబోతుంది అని తెలుస్తుంది.