Begin typing your search above and press return to search.
వలస కూలీలకు కేంద్రం వరం
By: Tupaki Desk | 8 Jun 2020 11:30 AM GMTవలస కూలీలంతా సొంతూళ్లకు చేరారు. ఇన్నాళ్లు ఉపాధి కోసం పలు రాష్ట్రాలు దాటి నగరాల్లో ఉపాధి పొందిన వారు పనిలేక పైసలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. నెలరోజుల నుంచి వలస వచ్చిన వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ మేరకు కేంద్రం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో కమిటీ వేసింది.
మరో రెండు రోజుల్లో కమిటీ నివేదిక అందజేయనుంది. సొంత గ్రామాలకు వచ్చిన కూలీల నైపుణ్యం ఆధారంగా పని కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాయం కూడా ఈ మినిస్టర్స్ తీసుకోనున్నారు.
వలస కూలీలకు ఉపాధి కల్పించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. 116 జిల్లాల్లో వలస కూలీలు ఉన్నారని గుర్తించింది. ఆ జిల్లాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో బీహార్ లోని 32 జిల్లాలు ఉన్నాయి.
బీహార్ తర్వాత అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 31 జిల్లాలు, మధ్యప్రదేశ్ లో 24, రాజస్థాన్ లో 22, ఒడిషాలో 4, జార్ఞండ్ లో 3 జిల్లాలున్నాయి. వీరిందరికి పునరావాసం కల్పించి ఉపాధి అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమవుతోంది.