Begin typing your search above and press return to search.
రంజాన్ పై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం..!
By: Tupaki Desk | 18 April 2020 12:30 PM GMTముస్లింలకు అత్యంత కీలకమైన రంజాన్ మాసం మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతుంది. రంజాన్ మాసం ప్రారంభం అనగానే ..ఆ హడావిడే వేరుగా ఉంటుంది. ఉదయం - సాయంత్రం మసీదులలో ప్రార్థనలు - ఉపవాస దీక్షలు - ఇఫ్తార్ విందులు. ఈ రంజాన్ మాసం మొత్తం సందడి సందడిగా ఉంటుంది. కానీ , ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాచి కూర్చుంది. ఈ కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. మార్చి 24 తర్వాత దేశంలో సామూహిక ప్రార్థనలు వద్దని - కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా హిందూ దేవాలయాలు - క్రిస్టియన్ చర్చిలతోపాటు ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. అయితే అక్కడక్కడా కొంతమంది గుంపులు గుంపులుగా చేరి ప్రార్థనలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల వారితో పాటుగా ..వారి కుటుంబ సభ్యులకి కూడా ప్రమాదమే. ఇక ఇదే తరుణంలో రంజాన్ మాసం ప్రారంభం కాబోతుండటంతో ..కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ...దేశంలోని అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం .. అన్ని రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ప్రతీ ఒక్కరు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలంటే రంజాన్ ప్రార్థనల్లోను సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించింది. మసీదులని మూసివేచి ఉంచాలని ,ప్రార్థనలు ఇళ్లల్లోనే చేసుకోవాలని తెలిపింది. కేంద్రం ఆదేశాలలో రాష్ట్రంలోని అన్ని మసీదులు మత పెద్దలకి సర్కులర్ జారీచేసినట్టు తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ మహమ్మద్ సలీమ్ తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి మసీదుకు సర్కులర్ పంపామని, లాక్ డౌన్ సమయం ముగిసే వరకు అందరూ కూడా తమ తమ ఇళ్లల్లోనే ప్రార్ధనలు చేసుకోవాలని తెలిపారు. అలాగే ఇఫ్తార్ విందులని కూడా తమ కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా చేసుకోవాలని తెలిపారు. అనవసరంగా బయటకి వస్తే మన ఇన్ని రోజులు ఇంట్లో ఉండి కూడా వృధా అవుతుంది అని, కాబట్టి అవసరానికి తగ్గట్టు ఇంటి నుండి బయటకి వచ్చి .. ఇంట్లోనే ఉంటూ రంజాన్ పండుగ జరుపుకోవాలని , ప్రభుత్వ సూచనలని పాటించాలని అయన కోరారు.