Begin typing your search above and press return to search.

విమాన ప్రయాణీకులకు మోతెక్కిపోవటం ఖాయం

By:  Tupaki Desk   |   11 Aug 2022 6:29 AM GMT
విమాన ప్రయాణీకులకు మోతెక్కిపోవటం ఖాయం
X
ఆగష్టు 31వ తేదీ తర్వాత విమాన ప్రయాణీకులకు మోతెక్కిపోవటం ఖాయం. ఎందుకంటే దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణాల ఛార్జీలపై పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్లో స్పష్టంచేశారు. ఇప్పటివరకు దేశీయంగా తిరిగే విమానాల ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వానికే కంట్రోల్ ఉండేది. ఉదాహరణకు హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-ముంబాయ్ మధ్య ఎంత ఛార్జీలు నిర్ణయించాలనే విషయంలో విమానయానశాఖ పరిమితులు విధించేది.

ఇపుడు ఆ పరిమితులను ఎత్తేయటంతో ఎంత దూరానికి ఎంత ఛార్జీలు వసూలు చేయాలన్నది పూర్తిగా విమానయాన సంస్ధల ఇష్టమే. అంటే సెప్టెంబర్ నుండి ప్రయాణీకులను విమానాలు కూడా బాదొదిలిపెట్టడం ఖాయం. ఇప్పటికే రైలు టికెట్ల ధరలను కేంద్ర రైల్వేశాఖ ఇష్టం వచ్చినట్లు పెంచేస్తోంది.

టికెట్ల ధరలను పెంచటంలో తత్కాలని, ప్రీమియం తత్కాలని, డైనమిక్ ఛార్జీలను ప్రయాణీకుల గూబలు గుయ్యిమనిపిస్తోంది. ఇదంతా కేంద్రం ఎందుకు చేస్తోందంటే మెల్లిగా అన్నీ వ్యవస్ధలను ప్రైవేటీకరించేయటంలో భాగమనే అర్ధమైపోతోంది.

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక్క రంగాన్ని ప్రైవేటీకరించుకుంటు వెళుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందుగా రైలు ఛార్జీలను పెంచేశారు. ఇపుడు విమాన టికెట్ల ధరలను కూడా పెంచుకునేందుకు ఆ యాజమాన్యాలకు అవకాశమిచ్చేశారు. ఉదాహరణకు హైదరాబాద్-ఢిల్లీ మధ్య టికెట్ ధర ఇపుడు రు. 10 వేలుంటే సెప్టెంబర్ నుంచి ఇదే దూరానికి టికెట్ ధర ఎంత తక్కువేసుకున్నా 20 వేల రూపాయల పైమాటనే చెప్పుకోవాలి.

కాంపిటీషన్ కారణంగా టికెట్ల ధరలు తగ్గుతాయని చెబుతారు కానీ అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. యాజమాన్యాలన్నీ కుమ్మకై మినిమం ఎంత ఛార్జి ఉండాలనేది నిర్ణయించుకుని దానిపైనే ఛార్జీలను నిర్ణయించుకుంటాయనటంలో సందేహంలేదు. మొదట్లో టికెట్ ధరలను తగ్గించినట్లే తగ్గించి తర్వాత ఫుల్లుగా వాయించేయటం ఖాయం.

టికెట్ ధరల పెంచినందుకు యాజమాన్యాలు వంద కారణాలు చెబుతాయి. అంతా నమో మాయని జనాలు సరిపెట్టుకోవటం తప్ప చేయగలిగేదేమీలేదంతే. కాకపోతే చివరకు ఎంత రేటు పెట్టినా సిండికెట్ అయినే ఆదరణ తగ్గినపుడు ఛార్జీలు తగ్గింపక తప్పదు. ఎలానూ ఫ్లైట్ ఛార్జీలు పెట్రోలు ధరల్లా రోజు మారుతుండేవే కదా.