Begin typing your search above and press return to search.
బండి సంజయ్ ముందు దీనికి సమాధానం చెప్తావా
By: Tupaki Desk | 18 Nov 2021 11:32 AM GMTతెలంగాణ నుంచి ధాన్యం కొనేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ సీజన్ లో ఇప్పటికే 60 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని తెలిపింది. ‘‘44.7 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకుంటామని గతంలో చెప్పాం. ఇకపై తీసుకోబోమని చెప్పాం. దీనికి తెలంగాణ అంగీకరించింది. దేశ అవసరాలకు మించి వరి సాగవుతోంది. కాబట్టి పంట మార్పిడి అనివార్యం. ’’ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి తేల్చి చెప్పినట్లయింది. ఓవైపు తెలంగాణ పండించిన ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ మహా ధర్నా చేపట్టిన సమయంలోనే కేంద్రం నుంచి ఈ తరహా ప్రకటన రావడం గమనార్హం. దీంతో ఏం చేయాలనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రశ్నగా మారింది.
అంటే.. ఈ విషయంలో కేంద్రంతో తాడోపేడో అన్నట్టున్న కేసీఆర్ ఏం చేస్తాడో చూడాలి. వాస్తవానికి తెలంగాణలో సాగైన పంట విస్తీర్ణం ప్రకారం దిగుబడి 90 లక్షల మెట్రిక్ టన్నులు పైగా ఉంటుంది. కేంద్రం చెప్పినట్టు 44 లక్షల టన్నులు సేకరిస్తే.. మిగిలిన పంటను ఏం చేయాలనేది ప్రశ్నం.
ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా? లేదా ? అన్నది చూడాలి. ఇప్పటివరకు 65 వేల కొనుగోలు కేంద్రాలకు గాను ఏర్పాటైనది నామమాత్రమే. పంట దిగుబడి పూర్తిగా చేతికొస్తున్న వేళ .. కేంద్రం నిర్ణయం కూడా తేలిపోవడంతో రాష్ట్ర సర్కారు ఏం చేస్తుందో చూడాలి.