Begin typing your search above and press return to search.
ఇన్నాళ్లకు ఓలా.. ఉబర్ 'పాపాలు' పండాయా? తాజాగా కేంద్రం నోటీసులు
By: Tupaki Desk | 21 May 2022 4:29 AM GMTస్మార్ట్ ఫోన్ నుంచి మీరు వెళ్లాల్సిన గమ్యస్థానం వివరాల్ని అందిస్తే చాలు.. సరసమైన ధరల్లో సుఖవంతమైన ప్రయాణంతో మిమ్మల్ని తీసుకెళతామంటూ ఊరించే ఓలా.. ఉబర్ క్యాబ్ సర్వీసులు ఎలా తగలబడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంట్రీ వేళ.. వావ్ అనిపించేలా వ్యవహరించిన ఈ సంస్థలు తర్వాతి కాలంలో కాసుల వేట తప్పించి.. వినియోగదారులు పడే పాట్ల గురించి అస్సలు పట్టించుకోని వైనం తెలిసిందే. మొదట్లో చౌకగా క్యాబ్ సేవల్ని అందించిన ఈ సంస్థలు.. తర్వాత కాలంలో చక్రవడ్డీతో సహా ముక్కుపిండి లాగిన తీరుతో ఇప్పుడు క్యాబ్ సర్వీసుల్ని వినియోగించాలంటే వణుకు పుట్టే స్థితికి తీసుకొచ్చారు.
క్యాబ్ బుక్ చేసినంతనే.. క్యాషా? ఆన్ లైన్ పేమెంటా? అన్న ప్రశ్నలు మొదలు పెట్టి.. గమ్యస్థానానికి అనుగుణంగా బుకింగ్ లను క్యాన్సిల్ చేయటం ఒక ఎత్తు అయితే.. ఏసీ వేస్తే ఒక రేటు.. ఏసీ వేయకుంటే మరో రేటుగా చెప్పటం.. పీక్స్ అవర్స్ లో ఒకలా.. నాన్ పీక్ అవర్స్ లో మరోలా.. వర్షం లాంటివి పడితే ఇంకోలా వ్యవహరించటంతో పాటు.. రాత్రిళ్లు పొద్దుపోయిన తర్వాత... తెల్లవారుజాము ప్రాంతాల్లో నిర్ణీత ఛార్జీలకు మించిన డబ్బులు వసూలు చేసే క్యాబ్ డ్రైవర్ల మీద చర్యల విషయంలో ఈ సంస్థలు అనుసరించే తీరుపై బోలెడన్ని ఫిర్యాదులు ఉన్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. క్యాబ్ సర్వీసులు అందించే ఈ సంస్థల ప్రతినిధుల్ని నేరుగా కాంటాక్టు చేసే అడ్రస్ లు లేకపోవటం.. ఈ రెండింటిలో ఒక దానికైతే కస్టమర్ కేర్ విభాగం ఉన్నప్పటికీ.. ఫోన్ల ద్వారా మాట్లాడే అవకాశం లేకపోవటం లాంటివెన్నో సేవాలోపాలు చేస్తున్నా.. వాటిని ముకుతాడు వేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నది లేదు. ఈ రెండు క్యాబ్ సర్వీసుల పుణ్యమా అని.. లక్షలాది మంది వెతలు పడుతున్నా.. ఈ సంస్థలకు మాత్రం అవేమీ పట్టని తీరు కనిపిస్తుంటుంది.
ఇలాంటివేళ.. క్యాబ్ అగ్రిగేటర్లుగా ఉన్న ఓలా.. ఉబర్ లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అన్యాయమైన వాణిజ్య విధానాల్ని అవలంబించటం.. వినియోగదారుల హక్కుల్ని ఉల్లంఘించటంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ ఫైర్ అయ్యింది. ఈ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లుగా పేర్కొంది.
జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ సమాచారం మేరకు గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 2022 మే ఒకటి వరకు అంటే.. ఏడాది వ్యవధిలో ఓలాపై 2482 కంప్లైంట్లు రాగా.. ఉబర్ మీద 770 ఫిర్యాదులు అందినట్లుగా పేర్కొన్నారు. మొత్తం ఫిర్యదుల్లో ఓలాపై 54 శాతం.. ఉబర్ పై 64 శాతం ఫిర్యదులు సేవా లోపానికి సంబంధించిన అంశాలపైనే కావటం గమనార్హం.
తాము ఇచ్చిన నోటీసులకు 15 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని ఈ రెండు సంస్థలకు కేంద్రం గడువును నిర్దేశించింది. గత ఏడాది వ్యవధిలో వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదుల్లో చాలా వరకు సేవలు అందించటంలో లోపాలు.. అన్యాయమైన వాణిజ్య విధానాలకు సంబంధించినవే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. ఓలా.. ఉబర్ చేసిన పాపాలు ఇన్నాళ్లకు పండాయా? అన్న భావన కలుగక మానదు. మరి.. కేంద్రం జారీ చేసిన నోటీసులపై సదరు సంస్థ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.