Begin typing your search above and press return to search.

ఈ 'నెంబ‌ర్-1'లు ఏంట్రా బాబూ... వైసీపీ నేత‌ల గ‌గ్గోలు..!

By:  Tupaki Desk   |   12 Dec 2022 2:30 PM GMT
ఈ నెంబ‌ర్-1లు ఏంట్రా బాబూ... వైసీపీ నేత‌ల గ‌గ్గోలు..!
X
రాష్ట్రంలో గ‌త రెండు మూడు రోజులుగా రెండు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌సాగుతోంది. దేశంలో ఏపీ నెంబ‌ర్-1 స్థానంలో ఉంది.. అంటూ పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఈ నెంబ‌ర్‌-1 గొడ‌వ‌తో.. వైసీపీ నాయ కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. దీనికి కార‌ణం. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ తాము అనేక రంగాల్లో నెంబ‌ర్-1 పొజిష‌న్‌లో ఉన్నామ‌ని చెబుతున్నారు. దీనిని ప్ర‌చారంలోకి తెచ్చారుకూడా!

అద్భుత‌మైన పాల‌న అందిస్తున్నామ‌ని. దేశంలో ఎక్క‌డా లేని సంక్షేమాన్ని కూడా అందిస్తున్నామ‌ని చెబు తున్నారు. రాష్ట్రం వెలిగిపోతోంద‌ని కూడా చెబుతున్నారు.కానీ, ఇంత‌లో పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారం భ‌మ‌య్యాయో లేదో..వెంటనే.. కేంద్రం నుంచి అనేక రూపాల్లో ఎదురీత‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఏపీ.. నెం బర్‌-1గా ఉందంటూ..కేంద్రం పార్ల‌మెంటులో ప్ర‌క‌టిస్తోంది.

అయితే, ఈ నెంబ‌ర్‌-1 ప్ర‌తిప‌క్షాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఉండ‌డ‌మే ఇప్పుడు వైసీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మా రింది. అదేంటంటే.. దేశంలో మాద‌క ద్ర‌వ్యాల వినియోగం.. స‌ర‌ఫ‌రాలో ఏపీ నెంబ‌ర్‌=1గా ఉంద‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డ‌మే. అంతేకాదు, దేశంలో ఏపీలో నిఘాను ముమ్మ‌రం చేయాల్సిన ప‌రిస్థితి కూడా వ‌చ్చింద‌ని కేంద్రం చెప్ప‌డ‌మే. దీంతో ఈ ప‌రిణామం వైసీపీ నాయ‌కుల‌కు ఇబ్బందిగా మారింది.

మ‌రోవైపు.. రైతులకు ఎంతో మేలు చేస్తున్నామ‌ని వైసీపీ ప్ర‌భుత్వం చెబుతోంది. వైస్సార్ రైతు భ‌రోసా కింద ఏటా.. కేంద్రం ఇస్తున్న నిధుల‌తో క‌లిపి 13500 రూపాయ‌లు ఇస్తున్నామ‌ని, రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేసి.. వారికి సేవ‌లు ముమ్మ‌రం చేశామ‌ని చెబుతోంది.

కానీ, క్షేత్ర‌స్థాయిలో మూడేళ్ల కాలంలో 1683 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని, దేశంలో ఇది కూడా నెంబ‌ర్‌1 పొజిష‌న్‌లోనే ఉంద‌ని కేంద్రం చెప్ప‌డం.. వైసీపీ నాయ‌కుల‌కు మాట పెగ‌ల కుండా చేస్తోంది. దీంతో ఈ నెంబ‌ర్‌-1 గొడ‌వేంట్రా బాబూ అని నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.