Begin typing your search above and press return to search.
స్కూళ్లు ఓపెన్ పై కేంద్రం సంచలన ప్రకటన
By: Tupaki Desk | 7 Jun 2020 11:18 AM GMTమహమ్మారి వైరస్ విజృంభించడం.. లాక్ డౌన్ పొడిగింపులతో దేశ విద్యావ్యవస్థ కుంటుపడింది. స్కూళ్లన్నీ మూతపడి విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండడంతో సామూహికంగా విద్యార్థులు తిరిగే పాఠశాలలను ఇప్పుడప్పడే తెరిచే ఆలోచనలో కేంద్రం లేదని తేటతెల్లమైంది.
ఒకరి నుంచి మరొకరికి సోకే ఈ అంటువ్యాధి కరోనాకు స్కూళ్లు తెరిస్తే విద్యార్థుల్లో ఒకరికి ఉన్నా అందరికీ ప్రమాదమే. పిల్లల ప్రాణాలను ఫణంగా పెట్టి స్కూళ్లు తెరిచే ఆలోచనలో కేంద్రం లేదు. ఇటీవల పదోతరగతి పరీక్షలను కూడా హైకోర్టు ఇందుకే వాయిదా వేసింది. ఈనేపథ్యంలోనే దేశంలో చదువుల పునరుద్ధరణ.. స్కూళ్ల ఓపెన్ పై కేంద్రం సంచలన ప్రకటన చేసింది.
తాజాగా కేంద్ర మంత్రి రమేష్ ప్రోఖ్రియాల్ దేశంలో ఆగస్టు తర్వాతే స్కూళ్లు ఓపెన్ అవుతాయని స్పష్టం చేశారు. అవకాశం ఉంటే ఆగస్టు 15 తర్వాత స్కూళ్లు ప్రారంభమవుతాయని.. ఈలోపు పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు.
స్కూళ్ల ఓపెన్ పై దేశంలోని 3 కోట్ల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు స్కూళ్లను తెరుస్తాయన్న ప్రచారం నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.