Begin typing your search above and press return to search.
స్కూళ్లు, కాలేజీలపై కేంద్రం సంచలన నిర్ణయం ..ఏంటంటే ?
By: Tupaki Desk | 26 Aug 2020 4:40 PM ISTకరోనా వైరస్ విస్తృత వ్యాప్తి మూలంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని రకాల విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. కాగా పలు స్కూల్స్, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు చెబుతూ, నడిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో స్కూళ్ల రీఓపెనింగ్ పై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అన్‌లాక్-3 దశలో ఉన్నాం. సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్-4 మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేసింది. అన్ లాక్-4లో మరిన్ని ఆంక్షలను సడలించినప్పటికీ విద్యా సంస్థలను మాత్రం తెరవకూడదని కేంద్రం నిర్ణయించింది. స్కూళ్లు, కాలేజీల పున: ప్రారంభానికి సంబంధించి కేంద్రహోంశాఖ నుంచి ఎలాంటి మార్గదర్శకాలను అందుకోలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ తెలిపారు.
ఈ నేపథ్యంలో మరిన్ని రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలు మూసివేసే ఉంటాయని తెలుస్తోంది. ఐతే సెప్టెంబర్ 1 నుంచి మాత్రం కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. . జేఈఈ, నీట్ నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం ఉండబోదన్నారు. మిగతా పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలదే బాధ్యత అని తేల్చిచెప్పారు. ఇక, ఇప్పట్లో స్కూళ్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. ఆన్ లైన్ క్లాసులపై అంతా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాలటు పోలిస్తే భారత్‌లో నమోదైన కరోనా మరణాలు చాలా తక్కువ అని.. ఇది నిజంగానే ఒక రికార్టుగా ప్రకటించింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. దేశంలో కరోనా రికవరీ రేటు 75 శాతానికి పైనే ఉందని.. అలాగే ఇప్పటివరకు మరణాల రేటు 1.58 శాతం మాత్రమే నమోదైందని తెలిపారు రాజేష్ భూషణ్ తెలిపారు. ఇకపోతే , దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 67151 కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 32లక్షల 34వేలు దాటింది. అలాగే 1059 మంది చనిపోయారు. మొత్తం మరణాలు 59వేల 449కి చేరాయి. ఇండియాలో ప్రస్తుతం మరణాల రేటు 1.8 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 3.42 ఉంది. నిన్న కరోనా నుంచి 63173 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 24లక్షల 67వేలు దాటింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7లక్షల 7వేలకు పైగా ఉన్నాయి.