Begin typing your search above and press return to search.

ఏపీకి వంద‌ల కోట్లు.. తెలంగాణకు ఉత్త చేతులు

By:  Tupaki Desk   |   8 Oct 2022 10:30 AM GMT
ఏపీకి వంద‌ల కోట్లు.. తెలంగాణకు ఉత్త చేతులు
X
నిధులు లేక అల్లాడుతున్న తెలంగాణ స‌ర్కారు.. కేంద్రం క‌రుణించాల‌ని.. చాలా రోజుల నుంచి కోరుకుం టోంది. అయితే.. కేంద్రం మాత్రం.. ఎప్ప‌టిక‌ప్పుడు.. తెలంగాణ‌కు షాక్ ఇస్తోంది. తాజాగా కూడా.. ఏపీకి నిధ‌లు ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌కు మాత్రం మొండి చేయి చూపింది. దీంతోతెలంగాణ స‌ర్కారు.. మ‌రోసారి కేంద్రంగాపై.. నిప్పులు చెరుగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఏం జ‌రిగిందంటే.. ఆంధ్రప్రదేశ్‌కు ఏడో విడత రెవెన్యూ లోటు గ్రాంట్ కింద కేంద్ర ప్ర‌భుత్వం రూ.879.08 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఒక‌ అధికారిక ప్రకటనలో కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏపికి 2022-23లో ఇప్పటి వరకు రూ.6153.58 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. అదేస‌మ‌యంలో…దేశంలో 14 రాష్ట్రాలకు ఏడో విడత రూ.7,183.42 కోట్ల రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన‌ట్టు పేర్కొంది.

అయితే.. ఈ జాబితాలో తెలంగాణ‌కు చోటు ద‌క్క‌క పోవ‌డం అంద‌రినీ విస్తుపోయేలా చేస్తోంది. వాస్త‌వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాలకు రూ.50,283.92 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్ విడుదల చేశారు.

వీటిలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మాత్ర‌మే ఉన్నాయి. కానీ, తెలంగాణ పేరు మ‌చ్చుకు కూడా క‌నిపించ‌లేదు.

వాస్త‌వానికి రెవెన్యూ లోటు త‌మ‌కు కూడా రావాల్సి ఉంద‌ని.. దీనిని త్వ‌ర‌గా ఇప్పించాల‌ని మంత్రి కేటీఆర్ కొన్ని రోజుల కింద‌ట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు.. లేఖ రాశారు. దీనిపై ట్వీట్ కూడా చేశారు.

ఈ క్ర‌మంలో ఇత‌ర రాష్ట్రాలతోపాటు.. త‌మ‌కు కూడా నిధులు ఇస్తుంద‌ని.. ఆయ‌న ఎదురు చూసి ఉంటారు.కానీ, తెలంగాణ ఊసు లేకుండా.. కేంద్రం ఇత‌ర రాష్ట్రాల‌కు నిధులు ఇవ్వ‌డం.. రాజ‌కీయంగా మ‌రింత దుమారం పెంచ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.