Begin typing your search above and press return to search.
మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగింపు?
By: Tupaki Desk | 19 April 2020 9:57 AM GMTమొదటి విడత లాక్ డౌన్ ప్రకటనకు ముందు భారత్ లో కరోనా కేసులు కేవలం దాదాపు 500గా ఉండేవి. ఏప్రిల్ 14వరకు విధించిన లాక్ డౌన్ లో 10వేలు దాటాయి. అంటే సరాసరి 20 రెట్లు కేసులు నమోదయ్యాయి. ఇది టూమచ్ కరోనా వ్యాప్తి. అందుకే మే 3వరకు ప్రధాని నరేంద్రమోడీ లాక్ డౌన్ పొడిగించారు. ఈ వారం రోజుల్లోనే కరోనా కేసులు దేశంలో 15వేలు దాటాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మరి ఇంకా ఏం చేయాలి?
లాక్ డౌన్ వల్ల దేశంలో కరోనా వ్యాప్తి తగ్గి.. కేసుల నమోదు తగ్గుతుందని కేంద్రం ఆశించింది. కానీ కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతుండడం.. వ్యాప్తిని నిరోధించడంలో కేంద్రం - రాష్ట్రాలు విఫలమవుతూనే ఉన్నాయి.
మరోపక్క ఏపీ సహా - బెంగాల్ - ఈశాన్య రాష్ట్రాలు లాక్ డౌన్ నుంచి సడలింపులను ఇస్తున్నాయి. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ తర్జనబర్జన పడుతున్న కేంద్రం తాజాగా మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. కేసుల సంఖ్య ఇలానే పెరిగితే మే చివరి వరకు కూడా లాక్ డౌన్ పొడిగించడం తప్ప కేంద్రానికి మరో మార్గం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా ఇదే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే దేశంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది.