Begin typing your search above and press return to search.
ప్రజా ప్రయోజనార్థమే ముందస్తు రిటైర్మెంట్: కేంద్రం
By: Tupaki Desk | 3 Sep 2020 2:30 AM GMTఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు....సర్వీసు ఉన్నంత కాలం కడుపులో చల్ల కదలకుండా నెలనెలా జీతం...రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ అనుభవించవచ్చు. సర్వీసు మధ్యలో సరిగ్గా పనిచేయకపోయినా...అవినీతి ఆరోపణలు వచ్చినా....సస్పెండ్ అయినా...పెద్దగా పోయేదేమీ లేదు. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప...చాలామంది అసమర్థ ప్రభుత్వుద్యోగులు కూడా మొత్తం సర్వీసు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణలో అసమర్థత, అవినీతి, అలక్ష్యం ప్రదర్శించే ఉద్యోగులకు ముందస్తు రిటైర్మెంట్ తప్పదని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. `ఫండమెంటల్ రూల్ 56` కింద ముందస్తు నిర్బంధ రిటైర్మెంట్ కు వీలుకల్పిస్తూ ఆగస్టు 28న మెమోరాండం జారీ చేసింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ‘ముందస్తు-నిర్బంధ’ పదవీ విరమణపై కేంద్రం మరింత క్లారిటీ ఇచ్చింది. పెన్షన్ నిబంధనల్లోని 50-55 ఏళ్లు నిండినా లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తయినా పనితీరును బట్టి సమీక్ష జరపాలని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎప్పుడైనా ఉద్యోగులకు ముందస్తు రిటైర్మెంట్ వర్తిస్తుందని తెలిపింది.
`ఫండమెంటల్ రూల్ 56` ప్రకారం ప్రజా ప్రయోజనం, సమర్థ పాలన, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు వీలుగా అసమర్థ, అవినీతి, అలక్ష్యం ప్రదర్శించే ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రకటించేందుకు కేంద్రానికి ప్రత్యేక హక్కులున్నాయి. 30 ఏళ్ల సర్వీసు లేదా 50/55 ఏళ్లు దాటిన ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. వారి ట్రాక్ రికార్డు సందేహాస్పదంగా ఉంటే కచ్చితంగా ముందస్తు పదవీ విరమణ చేయిస్తారు. అయితే, మరో ఏడాదిలో రిటైర్ అయ్యే ఉద్యోగులను కేవలం ‘అసమర్థత’ను సాకుగా చూపి తొలిగించకూడదు. శారీరకంగా, మానసికంగా ఒక్కసారిగా తీవ్రమైన మార్పు వస్తే మాత్రం ముందస్తు రిటైర్‌మెంట్ ఇచ్చే అవకాశముంది.
ఇక, పదోన్నతులు పొంది కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారిని కనీసం ఐదేళ్లపాటు కొనసాగించాలి. ఉద్యోగి సర్వీస్ రికార్డు మొత్తాన్ని పరిశీలించిన తర్వాతే ‘ముందస్తు రిటైర్‌మెంట్’పై నిర్ణయం తీసుకోవాలి. ఏసీఆర్/ ఏపీఏఆర్ లతో పాటు ఉద్యోగుల పనితీరు, ఏ స్థాయి వారు, ఎప్పుడెప్పుడు సమీక్షించాలనే వివరాలు కూడా నిబంధనల్లో వివరించారు. పాతదైన 56(జే) నిబంధనలను కేంద్రం తరచుగా వాడుతోంది. ఐఏఎస్, ఐపీఎస్‌లను ‘నిర్బంధ పదవీ విరమణ’ పేరిట ఇంటికి పంపుతోంది. ఈ నేపథ్యంలో విమర్శలు రావడంతో... ఉద్యోగుల తొలగింపు కేంద్రం హక్కు అని కేంద్రం ఆగస్టు 28న ఓ మెమోరాండం జారీ చేసింది. అంతేకాదు, మంచి పరిపాలన అందించేందుకు అసమర్థులను/పనికిరాని వారిని పక్కన పెట్టాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పులను ఆ మెమోరాండంలో కేంద్రం ప్రస్తావించడం గమనార్హం. పనికిరాని ఉద్యోగులను పీకి పడేయక తప్పదని కేంద్రం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చింది.