Begin typing your search above and press return to search.

స్మోకర్స్ కు 'షాక్' ఇవ్వబోతున్న కేంద్రం..!

By:  Tupaki Desk   |   12 Dec 2022 11:30 AM GMT
స్మోకర్స్ కు షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..!
X
భారత్ లో పొగాకు ఉత్పత్తుల వినియోగంగా నానాటికీ పెరిగిపోతోంది. పొగాకు సంబంధిత వస్తువుల్లో యువత ఎక్కువగా సిగెరెట్లకు అలవాటు పడుతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే చాలామంది క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 'స్మోగింగ్ ఈజ్ ఇన్జ్యూరస్ టూ హెల్త్' అని కేంద్రం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా స్మోకర్ పెద్దగా కేర్ చేయడం లేదు.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తున్నారు. తద్వారా సిగరెట్ల అమ్మకాలను కట్టడి చేయాలని భావిస్తున్నాయి. అలాగే పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్ను విధించడం ద్వారా కేంద్రానికి సైతం భారీగా ఆదాయం వస్తుంది. దీంతో ఈసారి కేంద్రం సింగిల్ సిగిరెట్ల విక్రయాలపై సంచలన నిర్ణయం తీసుకోబోతుందనే చర్చ తాజాగా నడుస్తోంది.

భారత్ లో ధూమపానం చేసే చాలామంది ప్యాకెట్ కు బదులుగా ఒకటి.. రెండు సిగిరెట్లను కొనుగోలు చేస్తుంటారు. విడిగా సిగరెట్ స్టిక్స్.. అన్ టైడ్ పొగాకు ఉత్పత్తులను తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులు.. యువతే కొనుగోలు చేస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. సింగిల్ గా సిగరెట్లను కొనుగోలు చేయడం యువతకు అనుకూలంగా మారుతూ వారికి స్మోకింగ్ అలవాటు మారుతుందని సర్వేలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే సింగిల్ సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. విమానాశ్రయాల్లో స్మోకింగ్ జోన్లను మూసివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. తద్వారా ఆయా ప్రాంతాల్లో స్మోకింగ్ ను నివారించాలని ప్లాన్ చేస్తోంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది.

దీంతోపాటు పొగాకు ఉత్పత్తులపై మరో భారీగా పన్ను విధించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కేంద్రం భావిస్తుందని తెలుస్తోంది. పొగాకు ఉత్పత్తుల ధరలను మరింత పెంచడం ద్వారా లక్షలాది మంది యువత వీటికి దూరమవుతారని చెబుతోంది.

అయితే సింగిల్ సిగరెట్లపై నిషేధం విధిస్తే బ్లాక్ మార్కెటింగ్ పెరిగే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే..!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.