Begin typing your search above and press return to search.
ఆ 10 రాష్ట్రాల్లోనే అత్యధిక కరోనా కేసులు: కేంద్రం !
By: Tupaki Desk | 24 May 2021 4:34 AM GMTమనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే, ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో తీవ్ర స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే కరోనా మరణాలు కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రతి రోజు కూడా లక్షల్లో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే , వేల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇటీవల నుండి దేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య కొంచెం తగ్గుముఖం పట్టాయి. దేశంలో నమోదైన కొత్త కేసుల్లో 76.66 శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు దేశంలో గత కొన్ని రోజులుగా కొత్తగా నమోదైయ్యే పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది.
దేశంలో కరోనా మహమ్మారిని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వాలు చేయని పని అంటూ లేదు. లాక్ డౌన్స్ , కర్ఫ్యూ వంటివి కట్టుదిట్టంగా అమలు చేస్తోన్నా కూడా కరోనా మహమ్మారి కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే .. దేశంలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు ఉన్న 10 రాష్ట్రాలను సూచించే మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. కర్ణాటక (4.83 లక్షలు), మహారాష్ట్ర (3.54 లక్షలు), కేరళ (2.89 లక్షలు), తమిళనాడు (2.84 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (2.10 లక్షలు), పశ్చిమ బెంగాల్ (1.31 లక్షలు), రాజస్థాన్ (1.22 లక్షలు), ఒడిశా 99,091), ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో (94,482) కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతోంది. సెకండ్ వేవ్‌లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు తీవ్రంగా ఉండటంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. మాస్క్ లు ధరించని వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు.