Begin typing your search above and press return to search.
టీకాలపై కేంద్రం విచిత్రమైన వాదన
By: Tupaki Desk | 17 May 2021 5:14 AM GMTదేశంలో అల్లాడిపోతున్న జనాలకు కోవిడ్ టీకాలు వేయించకుండా విదేశాలకు పంపడంపై యావత్ దేశం కేంద్రప్రభుత్వంపై మండిపోతోంది. దేశీయ అవసరాలకు సరిపడా టీకాలను ఉత్పత్తి చేయించాల్సిన కేంద్రం చేతులెత్తేసింది. ఇదే సమయంలో ఉత్పత్తియిన టీకాల్లో కొంతభాగం విదేశాలకు పంపుతోంది. దీంతో దేశవ్యాప్తంగా నరేంద్రమోడికి వ్యతిరేకంగా పెద్ద దుమారమే రేగుతోంది. టీకాలు కావాలని, ఎందుకు వేయించటం లేదని ప్రశ్నిస్తు పోస్టర్లు వేసిన కొందరిని కేంద్రప్రభుత్వం తాజాగా అరెస్టులు కూడా చేసింది.
ఇదే విషయమై సుప్రింకోర్టులో జరిగిన విచారణలో కేంద్రం వినిపించిన వాదన చాలా విచిత్రంగా ఉంది. యావత్ ప్రపంచమంతా కోవిడ్ వైరస్ తో అల్లాడుతున్న సమయంలో ప్రపంచం మొత్తాన్ని ఒకే యూనిట్ గా చూస్తున్నట్లు కేంద్రం చెప్పింది. రాష్ట్రం, దేశం, ప్రపంచమనే దృష్టితో చూడటం లేదని చెప్పింది. ప్రపంచంలోని జనాలకందరికీ టీకాలను అందించాల్సి బాధ్యతను దృష్టిలో పెట్టుకునే 90 దేశాలకు టీకాలను ఎగుమతి చేసినట్లు కేంద్రం చెప్పింది.
విదేశాల నుండి మనదేశంలోకి ప్రవేశించే టూరిస్టులకు కోరనా వైరస్ ఉంటే మనల్ని మనం కాపాడుకోలేమని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు విదేశీయులను ఇండియాలోకి రానీయకుండా బ్యాన్ చేయవచ్చు కదా అన్న ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పలేదు. ఇక మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే దేశంలో ఉత్పత్తవుతున్న టీకాలను జనాలందరికీ వేయటానికి సరిపడా సిబ్బంది, ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు లేవని చెప్పటం.
ఒకవైపేమో అందరికీ వేయటానికి సరపడా టీకాలు లేవని వైద్య సిబ్బంది చెబుతుంటే టీకాలు వేయటానికి సిబ్బంది, ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు లేవని చెప్పటమే చాలా విచిత్రంగా ఉంది. టీకాలు ఉత్పత్తిని పెంచటం, జనాలందరికీ టీకాలు వేయించటంలో తన చేతకానితనాన్ని కేంద్రం విచిత్రమైన పద్దతిలో సమర్ధించుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికి దేశం మొత్తంమీద 18 కోట్లమందికి మాత్రమే టీకాలు వేయించగలిగింది కేంద్రం. కేంద్రం చెప్పిన లెక్కలు, కారణాలను బట్టిచూస్తే దేశంలోని జనాలందరికీ టీకాలు అందాలంటే మరో రెండేళ్ళు పట్టేట్లుంది.